అవినాష్ రెడ్డిపై సీబీఐ ద‌ర్యాప్తు.. ప‌ర్య‌వ‌సానాలు.. కొంత పాలిటిక్స్‌!!

Update: 2023-02-25 15:00 GMT
వైసీపీ ఎంపీ..పైగా 'నా త‌మ్ముడు' అని సీఎం జ‌గ‌న్ స‌గ‌ర్వంగా చెప్పుకొనే క‌డ‌ప పార్ల‌మెంటు స‌భ్యుడు అవి నాష్ రెడ్డి. అయితే.. ఈ త‌మ్ముడు చుట్టూ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కేసు కీల‌క మ‌లుపులు తిరుగుతోంది. ఇప్ప టికే రెండుసార్లు అవినాష్‌ను విచారించిన సీబీఐ.. అనేక కీల‌క విష‌యాల‌పై కూపీ లాగిన‌ట్టు స‌మాచారం. గ‌తంలో ఒక‌సారి విచార‌ణ‌కు హాజ‌రైన‌.. అవినాశ్‌రెడ్డిని రెండు గంట‌ల‌కే బ‌య‌ట‌కు పంపేశారు.

కానీ, ఇప్పుడు తాజా విచార‌ణ‌లో మాత్రం గూగుల్ టేక్ అవుట్ ఆధారంగా.. ఏకంగా నాలుగున్న‌ర‌గంట‌ల పాటు విచారించారు. ఈ ప‌రిణామాలు చూస్తే.. ఎక్క‌డో తేడా కొడుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తంలో 2జీ స్పెక్ట్ర‌మ్ కేసును విచారించిన స‌మ‌యంలోనూ త‌మిళ‌నాడునేత డీఎంకే నాయ‌కురాలు.. క‌నిమొళిని సీబీఐ.. ఇలానే రెండు సార్లు విచారించి.. మూడోసారి అరెస్టు చేసిన విష‌యాన్ని ప‌రిశీల‌కులు గుర్తు చేస్తున్నారు.

ఇక‌, తాజాగా కేసు విష‌యానికి వ‌స్తే.. రెండోరోజు విచార‌ణ‌కు హాజ‌రైన అవినాష్‌ను సీబీఐ దాదాపు అరెస్టు చేసేస్తుంద‌నే ప్ర‌చారం జ‌రిగింది. మీడియా కూడా సీబీఐ కార్యాల‌యం ముందు ప‌డిగాపులు ప‌డింది. అయితే.. సుదీర్ఘ విచార‌ణ అనంత‌రం ఎలాంటి అరెస్టులు లేకుండానే ఆయ‌న‌ను వ‌దిలి పెట్టింది.

ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. సాధార‌ణంగా సీబీఐ విచార‌ణ‌కు వ‌చ్చిన వారు మౌనంగా వెళ్లిపోతారు. కానీ, అవినాష్ మాత్రం మీడియాతో సుమారు 20నిమిషాలు మాట్లాడారు.

అంతేకాదు.. ఈ స‌మ‌యంలో ఓ వ‌ర్గం మీడియా త‌న‌ను బ‌జారున ప‌డేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని.. వాస్త‌వా ల‌ను ప్ర‌చారం చేయ‌డం మానేసి.. త‌న చుట్టూ కొత్త క‌థ‌లు అల్లుతోంద‌ని..అవాస్త‌వాల‌ను వాస్తవాలుగా చూపే ప్ర‌క్రియ కూడా సాగుతోంద‌ని అవినాష్ పేర్కొన్నారు.

మొత్తంగా చూస్తే.. మూడోసారి పిలుస్తామ‌ని..సీబీఐ చెప్ప‌క‌పోయినా.. అవ‌స‌ర‌మైతే వెళ్లాల్సి ఉంటుంది. ఇక‌.. ఈ డొంక ఎక్క‌డ ఉందో.. ఇంకా క్లారిటీ లేక‌పోవ‌డం.. రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News