వివేకా హత్య : సిబిఐ కి మొగ్గు చూపని జగన్ సర్కార్ !

Update: 2020-01-08 11:06 GMT
వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి బదిలీ చేసే అంశంపై ఏపీ ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణ తుది దశలో ఉందని... ఇలాంటి సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు... కేసును ఈ నెల 20కి వాయిదా వేసింది. తదుపరి విచారణ ముగిసేవరకు తుది నివేదికను స్థానిక కోర్టులో దాఖలు చేయొద్దని సిట్ ను   హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి వైఎస్ వివేకా భార్య వేసిన అనుబంధ పిటిషన్‌ పై ఈ నెల 19లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఏజీని హైకోర్టు ఆదేశించింది.
 
ఇకపోతే ఈ కేసుకు సంబంధించి వివేకా భార్య సౌభాగ్యమ్మ వేసిన అనుబంధ పిటిషన్‌ పై  ఈ నెల 19లోగా కౌంటర్లు దాఖలు చేయాలనీ ఏజీకి కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు  సుమారు 1400 మందిని సిట్ విచారించింది. అందులో భాగంగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని - టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని కూడా విచారించిన సంగతి తెలిసిందే. అయితే ,  వివేకాను హత్య చేసింది ఎవరో సీఎం జగన్ మనస్సాక్షికి తెలుసు అని వ్యాఖ్యానించిన మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి... ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.
Tags:    

Similar News