మాజీ మంత్రి, సీఎం జగన్ బాబాయి అయిన వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతూనే ఉంది. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరిని ఇవాళ కడప నుంచి ప్రొద్దుటూరుకు అధికారులు తరలించారు. 164 సెక్షన్ కింద దస్తగిరి వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ ముందు నమోదు చేస్తున్నారు.
కాగా వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ కు నార్కో అనాలసిస్ పరీక్షల అనుమతి కోసం సీబీఐ దాఖలు చేసిన పిటీషన్ పై రేపు జమ్మలమడుగు కోర్టులో విచారణ జరుగనుంది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్ట్అయిన సునీల్ కుమార్ యాదవ్ ను సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇతడిని విచారించేందుకు కోర్టు నుంచి అనుమతి కోరనున్నారు. సునీల్ కుమార్ ప్రస్తుతం కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ లో ఉన్నారు. ఇతడిని ప్రొద్దుటూరుకు తీసుకెళ్లారు. విచారణ వేళ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అనుమానాస్పద ప్రదేశాల్లో సీబీఐ తనిఖీలు చేస్తోంది.
ఇప్పటికే విచారణ నిమిత్తం సునీల్ యాదవ్ ను సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ పులివెందుల మెజిస్ట్రేట్ అనుమతించారు. కాగా వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, మాజీ డ్రైవర్ దస్తగిరి, పాల వ్యాపారి ఉమాశంకర్ రెడ్డి, పులివెందులకు చెందిన చెప్పుల షాపు యజమాని మున్నాను ఇప్పటికే సీబీఐ అధికారులు విచారించి కీలక విషయాలు రాబట్టారు.
ఇక ఇటీవలే వైఎస్ కుటుంబ సభ్యులను కూడా సీబీఐ విచారించింది. కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా? అని ఆరాతీసింది.. పులివెందుల ఆర్అండ్ బీ అతిథిగృహంలో చేపట్టిన సీబీఐ విచారణకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఆయన సోదరుడైన పులివెందుల మున్సిపల్ వైస్ చైర్మన్ మనోహర్ రెడ్డి హాజరయ్యారు. వైఎస్ వివేకా కూతురు హైకోర్టుకు సమర్పించిన అనుమానితుల జాబితాలో వీళ్లిద్దరి పేర్లు ఉండడం గమనార్హం.
గతంలో వైఎస్ వివేకానందారెడ్డి ఎమ్మెల్సీగా బరిలో దిగినప్పుడు ఆయన ఓడిపోయేందుకు మనోహర్ రెడ్డి తదితరులు కారణమనే ఆరోపణలున్నాయి. ఈనేపథ్యంలోనే వైఎస్ భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డిల నుంచి రాబట్టిన సమాచారంపై ఏదైనా క్లారిటీ కోసం వైఎస్ వివేకా కూతురు సునీతను సీబీఐ అధికారులు పిలిపించి ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాళ్లిద్దరినీ విచారిస్తున్న నేపథ్యంలో సునీత నుంచి మరింత సమాచారం రాబట్టారనే ప్రచారం జరుగుతోంది.
కుటుంబ గొడవలే హత్యకు కారణాలై ఉంటాయా? వారి మధ్య గొడవలేంటి? ఆర్థికపరమైనవా? రాజకీయ సంబంధమైనవా? అనే కోణంలో సీబీఐ అధికారులు సమాచారం సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. వైఎస్ కుటుంబ సభ్యులను విచారణ పూర్తయ్యాక సునీల్ యాదవ్ కు నార్కో టెస్ట్ చేసి నిజాలు రాబట్టాలని సీబీఐ యోచిస్తోంది.