కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు తెచ్చుకున్న , కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ నివాసంలో సోమవారం ఉదయం సీబీఐ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. అవినీతి ఆరోపణల కేసులోనే ఈ దాడులు చేసినట్టు తెలుస్తోంది. మొత్తం 14 ప్రాంతాల్లో సీబీఐ ఏకకాలంలో దాడులు నిర్వహించినట్టు సమాచారం. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. సిరా, రాజరాజేశ్వర్ నగర్ స్థానాలకు ఉప-ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే శివకుమార్ నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా శివకుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతోన్న ఎన్నికలు కావడంతో ఆయన దీనిని సవాల్ గా తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. మనీలాండరింగ్ కేసులో గతేడాది సెప్టెంబరులో శివకుమార్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఆదాయ పన్ను శాఖ ఫైల్ చేసిన ఛార్జిషీట్ ఆధారంగా కాంగ్రెస్ నేతపై ఈడీ కేసు చేసి అదుపులోకి తీసుకుంది. 50 రోజుల తర్వాత బెయిల్ లభించడంతో ఆయన అక్టోబరు 23న తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. బహిర్గతం చేయని ఆదాయంలో రూ. 8.6 కోట్ల ఆస్తులను గుర్తించాయి. ఆ తర్వాత ఈ సంఖ్య రూ.11 కోట్లుగా సవరించారు.
ఇక, ఆదాయపు పన్ను శాఖ దాఖలు చేసిన చార్జిషీట్ ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 2018లో శివకుమార్ పై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక, 2017 రాజ్యసభ ఎన్నికల్లో గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేజారకుండా చూసుకోవడంలో.. కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావడం కోసం.. కాంగ్రెస్ నేతలు చేజారకుండా చూడటంలో రిసార్ట్ రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే , సీబీఐ దాడుల్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.. బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే శివకుమార్ పై సీబీఐ దాడులు చేయిస్తోందని ఆరోపణలు చేస్తుంది.