అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి దూసుకుపోతోంది. సుమారు 90 స్థానాల్లో టీఆర్‌ఎస్ ఆధిక్యంలో ఉంది. దీంతో తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. బాణాసంచా కాల్చుతూ.. స్వీట్లు పంచుకుంటున్నారు టీఆర్ ఎస్ నాయకులు - కార్యకర్తలు. తెలంగాణలో ఎక్కడ చూసినా జై తెలంగాణ నినాదాలు మార్మోగుతున్నాయి. మరోసారి టీఆర్ ఎస్ అధినేత - ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ప్రజలు పట్టం కట్టారు.
తెలంగాణలో తమదే అధికారం అని ప్రగల్భాలు పలికిన.. కాంగ్రెస్ నేతలు మాయమైపోయారు. శాసనసభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఊసే లేకుండా పోయింది. 90 స్థానాలు సాధిస్తామన్న హస్తం.. 15 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. తామే సీఎం అభ్యర్థులమని చెప్పుకున్న బడా నేతలు.. తమ నివాసాలకే పరిమితమయ్యారు. దీంతో గాంధీ భవన్ వెలవెలబోతోంది. గాంధీ భవన్ లో మీడియా ప్రతినిధులు తప్ప కాంగ్రెస్ నేతలు మాత్రం కనిపించడం లేదు. కొంతమంది కాంగ్రెస్ నేతలైతే తమ ఓటమి తెలుసుకొని కౌంటింగ్ కేంద్రాల నుంచి తమ నివాసాలకు వెళ్లిపోతున్నారు. జానారెడ్డి - రేవంత్ రెడ్డి - గీతారెడ్డి - చిన్నారెడ్డి - షబ్బీర్ అలీ - భట్టి విక్రమార్క - పొన్నాల లక్ష్మయ్య - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - డీకే అరుణతో పాటు పలువురు నేతలు వెనుకంజలో ఉన్నారు. జగిత్యాలలో జీవన్ రెడ్డి ఓటమి పాలయ్యారు.