ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తమిళుల సంప్రదాయ క్రీడపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో వైరుధ్యాలు ఉన్నాయనడానికి జల్లికట్టు ఉద్యమమే నిదర్శనమని తెలిపారు. జల్లికట్టుపై చెన్నైలో హైడ్రామా నడుస్తోందని… తమిళనాడులో జల్లికట్టు ఉద్యమ ఘనత కోసం రాజకీయ పోరాటం జరుగుతోందని అసదుద్దీన్ ఆరోపించారు. ఒకరిపై ఒకరు పై చేయి సాధించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఉమ్మడి పౌరస్మృతి గురించి ప్రస్తావిస్తూ దేశంలో ఉమ్మడి పౌరస్మృతి కుదరని పని అంటూ తన అసద్ ట్వీట్ చేశారు.
మరోవైపు జల్లికట్టు అంశంపై ఇవాళ సుప్రీంకోర్టు స్పందించింది. జల్లికట్టు నిషేధంపై మరో వారం రోజుల వరకు ఎటువంటి మధ్యంతర ఆదేశాలు ఇవ్వబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జల్లికట్టు సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చిస్తున్నాయని, దీనిపై నిర్ణయాన్ని ఓ వారం రోజుల పాటు వాయిదా వేయాలని సుప్రీంకోర్టును కోరినట్లు అటార్నీ జనరల్ తెలిపారు. చీఫ్ జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు ఏజీ ముకుల్ తెలిపారు. జల్లికట్టుపై అర్డినెన్స్ తేవాలని తమిళనాడులో ఆందోళనలు జరుగుతున్న విషయం కేంద్రానికి తెలుసన్నారు. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం చర్చిస్తున్నాయన్నారు. సాంప్రదాయ హక్కుల్ని కాపాడేందుకు మార్గాలు అన్వేషిస్తున్నట్లు అటార్నీ జనరల్ అన్నారు. జంతుసంరక్షణ హక్కులను కూడా పరిగణలోకి తీసుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. జల్లికట్టుపై తన అభిప్రాయాన్ని సేకరించిందా అని అడిగిన ప్రశ్నకు ఆయన నో అని సమాధానం ఇచ్చారు. మరోవైపు జల్లికట్టు నిరసనలకు మద్దతు తెలుపుతూ రైల్ రోకోలో పాల్గొన్న డీఎంకే నేత స్టాలిన్‌ను ముందస్తు జాగ్రత్తగా అరెస్టు చేశారు. కనిమొళి కూడా ఎగ్‌మోర్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనలో పాల్గొన్నారు.
తమిళనాడులో మూడు రోజులు ఉధృతంగా జరుగుతున్న జల్లికట్టు ఉద్యమం నేపథ్యంలో చెన్నై బ్యూటీ త్రిష యూటర్న్ తీసుకుంది. జల్లికట్టు నిషేధంపై ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తం అవుతున్న పరిస్థితుల్లో జల్లికట్టుకు తన మద్ధతును తెలిపారు. చెన్నై మెరీనా బీచ్‌కు వెళ్లి జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేయాలని ఆమె డిమాండ్ చేసింది. ఇండియన్ యానిమల్ రైట్స్ ఆర్గనైజేషన్ తరఫున జల్లికట్టును నిషేధించాలని కొద్ది రోజుల త్రిష సోషల్‌మీడియాలో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మండిపడ్డ తమిళ ప్రజలు ఆమె చచ్చిపోయిందంటూ పోస్ట్‌లను పెట్టారు. దాంతో దిగివచ్చిన త్రిష అందరికీ సారీ చెప్పిన వారి ఆందోళనలు ఆగలేదు. ఆమె షూటింగ్ జరిగే చోటుకు కూడా వెళ్లి అడ్డుకున్నారు. ఇక ఇప్పుడు జల్లికట్టుపై ఆందోళనలు ఎక్కువవుతున్న సమయంలో ఈ రోజు చెన్నై మెరీనా బీచ్‌కు వెళ్లి త్రిష తన మద్ధతు తెలిపింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/