తమిళనాడంతా శోక సంద్రంగా మారింది. అమ్మ ఇక లేరన్న చేదునిజాన్ని తమిళులు జీర్ణించుకోలేకపోతున్నారు. అమ్మను కడసారి చూసేందుకు పోటెత్తుతున్నారు. అమ్మ అంతిమ యాత్రకు సమయం తక్కువగా ఉండటం.. ఆమెను చూడాలనుకునే వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. సామాన్యులే కాదు.. అసమాన్యులు సైతం ఆమెను చూసేందుకు వస్తున్నారు.
వీవీఐపీలుగా వివిధ రంగాల్లో వెలిగిపోతున్న వారు సైతం.. ఆమెను చూసేందుకు ఆరాటపడుతున్నారు. సినీ.. రాజకీయ ప్రముఖులు ఎందరో అమ్మను కడసారి చూసేందుకు వస్తున్నారు. అత్యంత ప్రముఖులకు సైతం అమ్మను కడసారి చూసేందుకు క్షణం మాత్రమే సమయం చిక్కే పరిస్థితి. వేలాదిగా ప్రముఖులు బారులు తీరటం.. లక్షలాదిగా జనం పోటెత్తిన వేళ.. అమ్మ దర్శనం అతితక్కువ సమయం మాత్రమే లభిస్తోంది. అత్యంత ప్రముఖుల్ని సైతం.. క్షణ కాలం మాత్రమే చూసేందుకు అనుమతిస్తున్నారు. ‘అమ్మ’ ఎప్పుడూ అపురూపమేనన్న విషయానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/