మోడీ ప్రభుత్వం డిమానిటైజేషన్ తర్వాత తీసుకొచ్చిన పెద్ద నోటు అయిన రూ.2 వేల నోట్లపై వదంతులు వస్తూనే ఉన్నాయి. ఈ కరెన్సీ నోట్లు మార్కెట్ లోకి వచ్చిన దగ్గరి నుంచి ఏదో ఒక అంశంలో వార్తల్లో నిలుస్తూనే వస్తోంది. కేంద్ర ప్రభుత్వం రూ.2,000 నోట్లను రద్దు చేస్తోంది.. మోదీ సర్కార్ రూ.2 వేల నోట్లలో చిప్ పెట్టింది.. ప్రభుత్వం రూ.2 వేల నోట్ల ప్రింటింగ్‌ను ఆపేసింది.. ఇలా ఎన్నో రకాల రూమర్లు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రూ.2 వేల నోట్లపై కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. రూ.2,000 నోట్ల ప్రింటింగ్ ను నిలిపివేసినట్టు తాజాగా పార్లమెంట్ వేదికగా కేంద్రం స్పష్టం చేసింది.
దీనిపై ఓ ఎంపీ అడిగిన ప్రశ్న కి లోక్ సభ లో సమాధానం చెప్పిన కేంద్రం .. గత రెండుళ్లుగా రూ. 2 వేల నోట్ల ప్రింటింగ్ ను ఆపేసినట్టు తెలిపింది. అలాగే , రూ. 2 వేల నోట్ల ప్రింటింగ్ ఆపేసినంత మాత్రాన 2 వేల నోటు రద్దు చేస్తునట్టు కాదు అని , రూ. 2 వేల నోట్ల ను రద్దు చేసే ఆలోచనలో కేంద్రం లేదు అని స్పష్టంచేసింది. రెన్సీ నోట్ల ప్రింటింగ్ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)తో సంప్రదింపులు జరిపి తర్వాతనే ఏ నిర్ణయమైనా తీసుకుంటుందని వివరించారు. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా అన్ని రకాల కరెన్సీ నోట్లు అందుబాటులో ఉండేలా చూసుకుంటుందని తెలిపారు.