వ్యాక్సిన్లపై వస్తున్న వార్తలు పుకార్లేనన్న కేంద్రం

Update: 2020-12-10 13:17 GMT
ప్రపంచ దేశాలను కోవిడ్-19 మహమ్మారి గడగడలాడించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాణాంతక వైరస్ ను తరిమికొట్టే వ్యాక్సిన్ ను కనిపెట్టేందుకు అనేక దేశాలు యుద్ధప్రాతిపదికన ప్రయోగాలు చేపట్టాయి. త్వరలో భారత్ లోనూ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కోవ్యాక్సిన్ వచ్చే ఏడాది మార్చినాటికి ప్రజలకు అందించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. దీంతో,మరి కొద్ది నెలల్లో వ్యాక్సిన్ వచ్చేస్తుందన్న భరోసాతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ పై కొన్ని అనవసర పుకార్లు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. భారత్ బయోటెక్, సీరం ఇనిస్టిట్యూట్ లు రూపొందిస్తున్న వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిని నిరాకరించిందని ప్రచారం జరుగుతోంది. వ్యాక్సిన్‌ భద్రతకు సంబంధించి పూర్తి డేటా సమర్పించనందునే ఆ నిర్ణయం తీసుకున్నట్లు నిపుణుల కమిటీ స్పష్టం చేసిందని కథనాలు వెలువడ్డాయి.

అయితే ఆ క‌థ‌నాల్లో ఏ మాత్రం వాస్త‌వం లేద‌ని, అవి త‌ప్పుడు క‌థ‌నాల‌ని కేంద్ర‌ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఒక ప్ర‌క‌ట‌న విడుదల చేసింది. 4 రోజుల వ్యవధిలో భారత్‌ బయోటెక్‌, ఫైజర్‌, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలు.... డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు (డీసీజీఐ) దరఖాస్తులు సమర్పించాయని, అవి తిరస్కరణకు గురయ్యాయని ప్రచారం జరగుతోంది. ఈ ప్ర‌తిపాద‌న‌లపై స‌మీక్షించిన నిపుణుల క‌మిటీ.. టీకా భద్రతకు సంబంధించి పూర్తి డేటా లేనందున అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తించ‌డం కుద‌రద‌ని స్ప‌ష్టంచేసిట్లు వార్త‌లు వెలువ‌డ్డాయి. దీంతో, ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆ ఆ వార్తా క‌థ‌నాలు ఒట్టి పుకార్లేన‌ని కొట్టిపారేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్ర‌క‌ట‌న చేసింది. ఇటువంటి పుకార్లు నమ్మవద్దని స్పష్టం చేసింది.
Tags:    

Similar News