జగన్ సర్కార్ కి షాక్..హోదా లేదు ఏమీ లేదు అని తేల్చేసిన కేంద్రం !

Update: 2020-02-04 12:18 GMT
ఈ మధ్య వరుసగా ఏపీ ప్రభుత్వానికి షాకులు తగులుతున్నాయి. తాజాగా మరోసారి కేంద్రం మరో షాక్ ఇచ్చింది. ఏపీకి స్పెషల్ స్టేటస్ విషయంలో లోక్ సభలోలో మరోసారి  టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రభుత్వాన్ని ప్రశ్నించగా...  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని - కేంద్రం మరోసారి కుండబద్దలు కొట్టినట్టు స్పష్టం చేసింది. దీనిపై లోక్ సభలో కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు.

ప్రత్యేక హోదా ముగిసిన అంశం అని స్పష్టం చేశారు. 14వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల మేరకు ప్రత్యేక హోదా రద్దు చేశామన్నారు. అందుకే దాని స్థానంలో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించామని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కాగా, గతంలో కూడా కేంద్రం పార్లమెంట్ సాక్షిగా స్పెషల్ స్టేటస్ ఇచ్చేది లేదని చాలాసార్లు స్పష్టం చేసింది. హోదాకు మించిన ప్యాకేజీని ఇస్తామని - అప్పట్లో ప్యాకెజీ ఇవ్వడానికి ఒకే చెప్తే ..అప్పటి టీడీపీ ప్రభుత్వం కూడా అందుకు ఒప్పుకొని , ప్రత్యేక ప్యాకెజీని స్వాగతించింది అని చెప్పారు. అలాగే  బీహార్ - రాజస్థాన్ - ఒడిశా - ఝార్ఖండ్ - ఛత్తీస్‌ ఘడ్ తెలంగాణ - ఏపీల నుంచి హోదా రిక్వెస్టులు వచ్చాయని ఏ రాష్ట్రానికీ హోదా ఇచ్చేది లేదని అప్పట్లో నిర్మల సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. గతంలోనే ఏపీకిప్రత్యేక హోదా   ఇస్తే .. మరో 7 రాష్ట్రాలకు ఇవ్వాల్సి వస్తున్నందున  ఏ రాష్ట్రానికి ఇవ్వబోమని స్పష్టం చేసింది.


Tags:    

Similar News