ఏదైనా అపాయంలో ఇరుక్కున్నా.. పోలీసుల సాయం అవసరమైనా వెంటనే చేతి వేళ్లు కదిలేది ఫోన్లోని ‘100’కే. అదే.. ఫైర్ సర్వీసు అవసరమైతే ‘‘101’’ నెంబరుకు ఫోన్ చేస్తుంటాం. కానీ.. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు. సేవలు ఏవైనా సరే.. ‘‘112’’ నెంబరుకు ఫోన్ చేస్తే చాలు.. సేవలు అందుబాటులోకి వచ్చేలా కీలక నిర్ణయం దిశగా అడుగులు పడుతున్నాయి. అమెరికాలో ఏ అత్యవసర సేవకైనా ‘‘911’’ నెంబరుకి చేస్తే సరిపోతుంది. అదే తరహాలోనూ భారతదేశం మొత్తంగా ఏ అత్యవసర సర్వీసుకైనా సరే.. ‘‘112’’ నెంబరుకు ఫోన్ చేస్తే సరిపోయేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇందుకు సంబంధించి ట్రాయ్ చేసిన సిఫార్సును టెలికాం మంత్రిత్వశాఖలోని ఒక విభాగం నిర్ణయం తీసుకుంది. దీనికి టెలికాం మంత్రిత్వ శాఖ ఓకే చెప్పిన తర్వాత దీన్ని అధికారికంగా అమలు చేస్తారు. ప్రస్తుతం పోలీస్ సేవలకు 100.. ఫైర్ సర్వీస్ కు 101.. అంబులెన్స్ కోసం 102 ఇలా పలు సేవలకు పలు నెంబర్లను వినియోగిస్తున్నారు. దీనికి భిన్నంగా అన్ని అత్యవసర సేవలకు 112 నెంబరును వినియోగించేలా చూడాలని టెలికం మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఆ దిశగా త్వరలో అధికార నిర్ణయం అమల్లోకి రానుంది. అదే జరిగితే.. అత్యవసర సేవ ఏదైనా సరే.. ‘‘112’’కి చేస్తే సరిపోనుంది