కేంద్రం ప్ర‌శ్న‌తో చీపురుపార్టీకి చిక్కులేనా?

Update: 2017-05-06 05:37 GMT
ఢిల్లీ రాష్ట్ర అధికార‌ప‌క్షంగా.. దేశంలోని రాజ‌కీయ పార్టీల‌కు ప్ర‌త్యామ్నాయంగా అభివ‌ర్ణించిన ఆమ్ ఆద్మీ పార్టీ ప‌రిస్థితి ఎలా ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. దేశ రాజ‌కీయాల్లోమార్పు తీసుకొస్తాన‌ని.. అభివృద్ధి విష‌యంలో కొత్త పుంత‌లు తొక్కిస్తానంటూ చెప్పిన మాట‌ల‌కు భిన్నంగా ఆ పార్టీ స‌ర్కారు ఉండ‌టం తెలిసిందే. నిత్యం బీజేపీపైనా.. ప్ర‌ధాని మోడీని ఇరుకున పెట్టేలా ప్ర‌య‌త్నాలు చేస్తూ.. త‌న‌కు తాను తిప్ప‌ల్ని కొని తెచ్చుకోంటోంది కేజ్రీవాల్ పార్టీ.

త‌మ పార్టీ నేత‌ల్ని ల‌క్ష్యంగా చేసుకొని కేంద్రం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని.. త‌మ నేత‌ల్నిటార్గెట్ చేస్తూ కేంద్రం సీబీఐని ఉసిగొల్పుతుంద‌న్న ఆరోప‌ణ‌లు చేసిన త‌ర్వాతి రోజునే నాట‌కీయ‌ప‌రిణామం ఒక‌టి చోటు చేసుకోవ‌టం గ‌మ‌నార్హం. ఆ పార్టీకి విదేశాల నుంచి అందుతున్న రాజ‌కీయ విరాలాల వివ‌రాల్సి ఇవ్వాల్సిందిగా కోరుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నోటీసుల నేపథ్యంలో అమ్ ఆద్మీ పార్టీ విదేశీ విరాళాల నియంత్ర‌ణ చ‌ట్టాన్ని అనుస‌రిస్తుందా? ఉల్లంఘిస్తుందా? అన్న‌ది ఇప్పుడు తేలనుంది.

కేంద్ర హోంశాఖ జారీ చేసిన తాజా నోటీసులు చూస్తే.. త‌మ‌న టార్గెట్ చేసిన‌ట్లుగా ఉందే త‌ప్పించి.. మ‌రోలా లేద‌న్న అభిప్రాయాన్ని ఆ పార్టీ నేత‌లు ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. ఇది త‌మ‌ను ల‌క్ష్యంగా చేసుకొని జారీ చేసిన నోటీసులుగా ఆ పార్టీ అభివ‌ర్ణిస్తుంటే.. అందుకు భిన్నంగా రియాక్ట్ అయ్యింది కేంద్రం. అయితే.. ఇది కేవ‌లం.. రోటీన్ లో బాగంగా అడిగే ప్ర‌శ్న‌లే త‌ప్పించి.. ఇందులో ఎలాంటి రాజ‌కీయాల‌కు సంబంధం లేద‌ని చెబుతోంది.

ఆమ్ పార్టీ చెబుతున్న‌ట్లుగా ఇదెంత‌మాత్రం షోకాజ్ నోటీసు కాద‌ని పేర్కొంది. ఆమ్ పార్టీ నుంచి వ‌చ్చిన స‌మాధానాన్ని అనుస‌రించి.. ఆ పార్టీపై త‌గిన నిర్ణ‌యాన్ని తీసుకోనున్న‌ట్లుగా కేంద్ర హోంశాఖ చెబుతోంది. తాజా ప‌రిణామం ఆమ్ ఆద్మీ పార్టీకి ఇబ్బందిక‌రంగా ఉంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. తాజా ప‌రిణామాలు చీపురుపార్టీకి కొత్త చిక్కులు త‌ప్పేలా లేద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News