కొన్ని సదుపాయలు మనకు ఎంత సౌలభ్యం కలిగిస్తాయో..అంతే ఇబ్బందులను కలిగిస్తాయి. ముఖ్యంగా ప్రభుత్వ పరమైన అంశాలు అయితే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఏదో ఒక రూపంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అలాంటి వాటిల్లో ఆధార్ ఒకటని చెప్పుకోవచ్చు. ఆధార్ వల్ల ఎన్నో పనులు అనవసర జాప్యం తొలగిపోయింది. అయితే అదే ఆధార్ పలు సమస్యలను కూడా తెచ్చిపెట్టింది. ఇలా ఇబ్బంది పడ్డవారు కోర్టులను ఆశ్రయించారు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం దిమ్మతిరిగే వాదన వినిపించింది. ఆధార్ కార్డులతో వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందన్న వాదన బోగస్ అని కేంద్రం కొట్టిపారేసింది. అతడు లేదా ఆమెకు వారి శరీరంపై పూర్తి హక్కు ఉండదని వాదించింది.
ఇటీవల పాన్ కార్డుకు ఆధార్ లింకేజి తప్పనిసరి చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీకోర్టులో కేసు దాఖలైంది. ఈ సందర్భంగా జస్టిస్ ఏకే సిక్రీ - జస్టిస్ అశోక్ భూషణ్ తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనానికి అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వివరణ ఇస్తూ నల్లధనాన్ని చెలామణి చేసేందుకు, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చేందుకు పాన్‌కార్డును దుర్వినియోగం చేస్తున్న దరిమిలా వాటికి ఆధార్ తప్పనిసరి అని స్పష్టంచేశారు. ``ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్ పోర్టు పొందే సందర్భంలో సంబంధిత వ్యక్తులు వేలి ముద్రలు వేయాల్సి ఉంటుందనేది అందరికీ తెలిసిందే. పాన్ కార్డ్ విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. ఇప్పుడు తేడా ఒక్కటే. ఫొటో, వేలి ముద్రలు కాగితంపై కాకుండా ఒక ఎలక్ట్రానిక్ యంత్రంలో నిక్షిప్తం చేస్తారు. ఇందులో వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం లేదా దేహంలోకి చొరబడటం ఏముంది?`` అని ప్రశ్నించారు. అసలు ఒక వ్యక్తికి ఆయన శరీరంపై పూర్తి హక్కులు ఉండవని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ అన్నారు. ఆధార్ రూపంలో సేకరించే బయోమెట్రిక్ సమాచారం సెంట్రల్ డాటాబేస్‌లో సంకేత సందేశాల రూపంలో నిక్షిప్తం చేస్తారని, ఆ వివరాలను ఏదైనా క్రిమినల్ కేసులలో కోర్టు కోరినప్పుడు మాత్రమే అందజేస్తారని తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/