ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు అన్నట్లుగా.. ఏపీ రాష్ట్ర ప్రజలకు ఒక తీపి కబురును అందించింది మోడీ సర్కారు. ఏపీ రూపు రేఖల్ని మార్చేందుకు అవసరమైన ఒక ప్రణాళికను సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేయించటం.. ఈ ప్రతిపాదనను కేంద్రం ముందుకు తీసుకెళ్లారు. దీన్ని పరిశీలించిన కేంద్రం.. సీఎం జగన్ ప్రతిపాదనకు ఓకే చెప్పిన వైనం ఏపీకి తీపి కబురుగా చెప్పాలి. దేశంలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణాన్ని చేపట్టింది మోడీ సర్కారు. తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం ఈ విషయంలో ఏపీ రాష్ట్రానికి కేంద్రం పెద్ద పీట వేయటం విశేషం.
రాష్ట్రానికి కొత్త ఎక్స్ ప్రెస్ హైవేలను కేటాయించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదనను కేంద్రం ఓకే చేసింది. దీంతో.. ఏపీ గుండా మొత్తం6 కొత్త ఎక్స్ ప్రెస్ హైవేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ప్రధానంగా పోర్టులు.. పారిశ్రామిక కారిడార్లు ఉన్న మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్ని దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేసేలా ఈ ఎక్స్ ప్రెస్ హైవేలను నిర్మించనున్నారు. దేశ వ్యాప్తంగా 22 ఎక్స్ ప్రెస్ హైవేల్ని మోడీ సర్కారు నిర్మిస్తుంటే.. అందులో ఆరు మన రాష్ట్రం మీదుగా వెళ్లేందుకు కేంద్రం ఓకే చెప్పటంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇందులో భాగంగా దేశం మొత్తం మీదా 2157 కి.మీ. మేర కేంద్రం ఎక్స్ ప్రెస్ హైవేలను నిర్మించనున్నారు. ఇందులో రాష్ట్ర పరిదిలో378 కి.మీ.లను నిర్మిస్తారు. ఇంతకూ ఏపీ మీదుగా వెళ్లే ఆరు హైవేలు ఏమిటన్న విషయాన్ని చూస్తే..
1. చిత్తూరు – చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవేను 125 కి.మీ. మేర నిర్మిస్తారు. ఇది రాష్ట్రంలో 75 కి.మీ. నిడివి ఉంది. రూ.3,150 కోట్లతో నిర్మించే ఈ హైవేను 2024 మార్చి నాటికి పూర్తి అవుతుంది.
2. రాయ్‌పూర్ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ హైవే 464 కి.మీ. ఉంటుంది. ఈ హైవే దేశంలోనే లాజిస్టిక్స్ రంగంలో కీలకం కానుంది. రాష్ట్రంలో 100 కి.మీ.మేర దీనిని నిర్మిస్తారు. మొత్తం రూ.4,200 కోట్లతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు 2024 మార్చి నాటికి పూర్తి చేస్తారు.
3. విజయవాడ –నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ హైవేను 457 కి.మీ.మేర నిర్మిస్తారు. రాష్ట్రంలో 29 కి.మీ. మేర దీని నిడివి ఉంటుంది. రూ.1,218 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టును 2025 మార్చి నాటికి పూర్తి చేస్తారు.
4. కర్నూల్ - షోలాపూర్ఎక్స్ ప్రెస్ హైవేను రూ.318కి.మీ. మేర నిర్మిస్తారు. అందులో రాష్ట్రం నుంచి 10కి.మీ. ఉంటుంది. రూ.420 కోట్ల నిధుల ఖర్చుతో దీన్ని 2025మార్చికి పూర్తి చేస్తారు.
5. హైదరాబాద్ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ హైవేను 521 కి.మీ. మేర నిర్మిస్తారు. ఏజెన్సీ ప్రాంతాల గుండా సాగే ఈ రోడ్డు రాష్ట్రంలో 72 కి.మీ. ఉంటుంది. రూ.3,024 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టును 2025 మార్చి నాటికి పూర్తి చేస్తారు.
6. బెంగళూరు - చెన్నై ఎక్స్ ప్రెస్ హైవేను 272 కి.మీ. మేరకు నిర్మిస్తారు. ఇందులో 92 కి.మీ. చిత్తూరు.. అనంతపురం జిల్లాల గుండా వెళ్లనుంది. రూ.3864 కోట్లు ఖర్చు చేసి ఈ ప్రాజెక్టు 2024 మార్చి నాటికి ప్రారంభిస్తామంటున్నారు. ప్రకటన అయితే ఘనంగా ఉంది.. మరి.. పనులు ఎంత వరకు ఉంటాయో ముందుకుపడతాయి? అన్న ప్రశ్నలు ఉన్నాయి. ఏమైనా చాలా రోజుల తర్వాత ఏపీకి కేంద్రంలోని మోడీ సర్కారు సరైన తీపికబురు చెప్పిందనే చెప్పాలి.