కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో పరిస్ధితిని తక్కువ సమయంలో అంచనా వేయడంతో పాటు తగిన పరిష్కారాలు సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాలను పంపుతోంది. ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్ వంటి కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు వెళ్లిన కేంద్ర బృందాలు వచ్చే నెల 4న ఏపీలోనూ పర్యటించనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజూకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌పై అధ్యయనం చేసేందుకు మే 4న రాష్ర్టంలో కేంద్ర బృందం పర్యటించనుంది. కరోనా ప్రభావం, తాజా పరిస్థితులు, లాక్ డౌన్ అమలు తీరు, కరోనా పరీక్షలు జరిగే విధానం, కరోనా బాధిత రోగులకు అందుతున్న వైద్యంపై కేంద్ర బృందం సమీక్ష చేయనుంది. దీంతో పాటు రెడ్ జోన్, గ్రీన్ జోన్, ఆరంజ్ జోన్లలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపైనా అధ్యయనం చేయనుంది. అలాగే వైద్యులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది రక్షణకు తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నాక, అవసరమైతే సూచనలు చేస్తారు. అనంతరం స్ధానికంగా తమకు అందిన సమాచారం మేరకు ఓ నివేదికను కేంద్రానికి అందించనున్నాయి. కాగా, ఇప్పటివరకు ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 1403కు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో 71 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.