ఏపీకి కేంద్రం తాజాగా ఆర్థిక సహాయం ప్రకటించింది. అయితే... కొండంత లోటుకు ఈ గోరంత సాయం ఎంతవరకు సరిపోతుందన్న ప్రశ్న ఉత్పన్న మవుతోంది. కొద్దికాలంలో ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాటం ఉద్ధృతమైన సమయంలో ప్యాకేజీ ఇస్తామని - హోదా ఇవ్వలేమని కేంద్రం చెప్పింది. ఈ ప్యాకేజీ కూడా భారీగా ఉంటుందని చెబుతున్నా దానికి సంబంధించిన విధి విధానాలు మాత్రం ఇంకా ఖరారవలేదు. ఇదే సమయంలో కేంద్రం ఏపీకి రిలీజ్ చేసిన ఆర్థిక సహాయం నిధులు విమర్శలకు దారి తీస్తున్నాయి. విభజన కారణంగా తీవ్ర ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న రాష్ట్రాన్ని ఆదుకుంటామని చెబుతున్న కేంద్రం ఇప్పుడు కేవలం 1976 కోట్లు మాత్రమే ఇవ్వడంతో కేంద్రం ఇవ్వబోయే ప్యాకేజీ కూడా ఇలాగే ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీకి కేంద్ర ప్రభుత్వం రూ. 1976 కోట్లను విడుదల చేయగా అందులో రెవెన్యూ లోటు భర్తీకి రూ. 1176కోట్లు - రాజధాని అభివృద్ధికి రూ. 450 కోట్లు - వెనుకబడిన జిల్లాలకు రూ. 350కోట్లు ఇచ్చారు. కొద్ది రోజులుగా కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు - సుజనా చౌదరిలు కేంద్రం ఆర్థిక ప్యాకేజ్ పై కసరత్తు చేస్తోందని చెబుతూ వస్తున్నారు. రెండు రోజుల క్రితం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా చంద్రబాబుతో చర్చలు జరిపారని.. ప్యాకేజ్ ప్రకటిస్తారని హడావుడి చేశారు. అది భారీగా ఉంటుందంటూ హంగామా చేశారు. ఈ సమయంలోనే కేంద్రం రూ. 1976 కోట్లు విడుదల చేయడంతో అంతా తుస్సుమన్నారు.
సుజనా చౌదరి - వెంకయ్య చెప్పిన ఆర్ధిక సాయం ఇదేనా లేకుంటే భారీగా ఆర్థిక ప్యాకేజ్ ను విడిగా ప్రకటిస్తారా చూడాలి. గతంలో వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ఇచ్చింది కూడా తక్కువే. భర్తీ చేయాల్సిన రెవెన్యూ లోటు కూడా భారీగానే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా అరకొరగా ఇవ్వడంతో ప్యాకేజీ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందన్న అనుమానాలను వ్యక్తంచేస్తున్నారు రాజకీయ పరిశీలకులు.