కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది మార్చిలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత లాక్ డౌన్ నుండి సడలింపులు ఇచ్చినా కూడా స్కూళ్లు మాత్రం తెరవలేదు. ఆ తర్వాత మెల్లి మెల్లిగా స్కూళ్లు తెరచినా కూడా అక్కడక్కడ కరోనా కేసుల భయంతో సరిగ్గా నడవడమే లేదు. ఇదిలా ఉంటే కరోనా సమయంలో కూడా ఉపాధ్యాయులు ఆలస్యంగా రావడాన్ని విద్యార్థులు పేరెంట్స్ సహించలేకపోయారు.
దీనితో టీచర్స్ కి నిరసన తెలియజేయాలని ఏకంగా హెచ్ ఎం గదికి తాళం వేసేశారు. స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ తాళం వేసి నిలదీయడంతో ఉపాధ్యాయుల ఏంచెప్పాలో తెలియక తెల్లమొఖం వేశారు. ఈ షాకింగ్ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే .. ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని కూడేరు జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయులు ఆలస్యంగా రావడంపై స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ ఓబుళపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలే కరోనా కారణంగా విద్యార్థుల చదువులు అంతంతమాత్రంగా ఉన్నాయని.. టీచర్లు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. ప్రధానోపాధ్యాయుడి గదికి తాళం వేసి నిరసన తెలిపారు. ఆలస్యంగా వచ్చి అడ్డంగా బుక్కైన ఉపాధ్యాయులు ఏం చెప్పలేక సైలెంట్ గా నిలబడిపోయారు. వైఎస్ జగన్ సర్కార్ ప్రతి పాఠశాలకి విద్యార్థుల పేరెంట్స్ తో నూతనంగా స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ లను నియమించిన విషయం తెలిసిందే.