ఇంత టెన్షన్ లోనూ మనమడ్ని తీసుకొచ్చిన బాబు

Update: 2019-04-07 04:55 GMT
పోలిక సరిగా లేదనిపించొచ్చు కానీ.. చాలామంది నోటి నుంచి వినిపిస్తున్న మాటను చెప్పాల్సిందే. ఏపీలో ఎన్నికల వేడి ఎంత హాట్ హాట్ గా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. పోటాపోటీగా సాగుతున్న ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకోవటమే కాదు.. మరో మూడు రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో.. ఎవరికి వారు తమ ప్రచారాన్ని ముమ్మరం చేయటమే కాదు.. ఏ చిన్న అవకాశం దొరికినా తమ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు.

ఇంత హీట్ జనరేట్ చేస్తున్న ఎన్నికల వేళ.. ప్రచారాన్ని పక్కన పెట్టేసి.. ఫ్యామిలీతో ఒక కార్యక్రమానికి హాజరు కావటం సాధ్యమా? అంటే నో చెబుతారు. కానీ.. అలాంటి పని చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. తాజాగా జరిగిన ఉగాదిని పురస్కరించుకొని ఏపీ సర్కారు నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అంతేనా.. ఉగాది సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన చంద్రబాబు.. మనమడు దేవాన్ష్ ను వెంట పెట్టుకొచ్చారు.

ఫ్యామిలీతో వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబుకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మరో ఐదారు రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఓటమి ఖాయమైన నేపథ్యంలో.. తన ఆఖరి అధికారిక కార్యక్రమంగా తాజా ప్రోగ్రాంకు వచ్చినట్లుగా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇందులో నిజమెంత అన్న విషయాన్ని పక్కన పెడితే.. నరాలు తెగిపోయే ఉత్కంటతో పాటు.. తుది పలితంపై కొలిక్కి రాని వేళ.. అంత కూల్ గా కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది పర్వదినానికి హాజరు కావటమా?  అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. ఇప్పుడైతే అధికార హోదాలో వెళ్లొచ్చు. ఆ అవకాశం మరికొద్ది రోజుల్లో చేజారనున్న విషయాన్ని గుర్తించే.. బాబు ఇప్పుడిలా ప్లాన్ చేసి ఉంటారేమోనని జగన్ పార్టీ నేతలు కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.
Tags:    

Similar News