బోస్టన్ నివేదికపై స్పందించిన చంద్రబాబు

Update: 2020-01-04 10:13 GMT
ఏపీ రాజధాని పై ఏర్పాటు చేసిన బోస్టన్ కమిటీ తాజాగా సీఎం జగన్ కు నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే.. విశాఖను రాజధానిగా ఏర్పాటు చేస్తేనే బెటర్ అన్న రీతిలో ఆ సంస్థ రిపోర్టు లో నివేదించింది.

దీనిపై తాజాగా ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. బీసీజీ నివేదికపై నిప్పులు చెరిగారు. బీసీజీ గ్రూప్ తో విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి కి సంబంధాలు ఉన్నాయని.. రోహిత్ రెడ్డి చెప్పిందే బీసీజీ రాసిచ్చిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. బీసీజీ కి తల తోక ఉందా? అని ఫైర్ అయ్యారు. మీకు నచ్చిన విధంగా బీసీజీ నివేదిక ఇచ్చారని మండిపడ్డారు.ఈ నివేదికకు విశ్వసనీయత లేదని స్పష్టం చేశారు.

ఇక జీఎన్ రావు నివేదిక పైన చంద్రబాబు ధ్వజమెత్తారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం చెప్పినట్టు జీఎన్ రావు రాసిచ్చాడని మండి పడ్డారు. తప్పుడు నివేదికలతో ప్రజలను మోసం చేస్తున్నారని మండి పడ్డారు. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనంటూ చంద్రబాబు స్పష్టం చేశారు.

వైఎస్ జగన్ అమరావతి లో కట్టుకున్న ఇల్లు కూడా ఇన్ సైడర్ ట్రేడింగ్ కాదా అని చంద్రబాబు ప్రశ్నించారు. కొత్త నగరాలు సైబరాబాద్, నవీ ముంబై, డెహ్రాడూన్ అభివృద్ధి చెందలేదా అమరావతిని ఎందుకు కాలరాస్తున్నారని మండిపడ్డారు.


Tags:    

Similar News