కేంద్రానికి షాకిచ్చిన చంద్రబాబు..

Update: 2019-03-27 11:12 GMT
ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఎన్నికల కమిషన్ తో ఢీకొంటున్నారు. ఈసీ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ డీజీపీ ఏబీ వేంకటేశ్వరరావు బదిలీని నిలిపివేస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం నాడు జీవోను విడుదల చేసి సంచలనం రేపింది. కడప, శ్రీకాకుళం ఎస్పీలను కూడా బదిలీ చేసింది.

ఇటీవలే ప్రతిపక్ష వైసీపీ ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో బదిలీలు చేసింది. ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వేంకటేశ్వరరావుతోపాటు శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మలను బదిలీ చేస్తూ సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సంఘం పరిధిలోకి రాని ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావును బదిలీని నిలిపివేస్తూ ఏపీ సర్కారు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎన్నికల విధులతో సంబంధం ఉన్న పోలీసు అధికారులను సీఈసీ పరిధిలోకి తెస్తూ ఏపీ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. అయితే ఇంటలిజెన్స్ డీజీకి మాత్రం జీవోలో చోటు కల్పించలేదు. ఎన్నికల విధులతో ఇంటెలిజెన్స్ డీజీ కి సంబంధం లేనందున ఆయన బదిలీ ఉత్తర్వులను రద్దు చేశారు.

ఇలా ఆపద్ధర్మ ప్రభుత్వం ఏపీలో ఉన్నా.. చంద్రబాబుకు అధికారాలు నామమాత్రంగా ఉన్న అధికారులతో మెయింటేన్ చేయిస్తూ బదిలీ ఉత్తర్వులను రద్దు చేయడం సంచలనంగా మారింది. కేంద్ర ఎన్నికల సంఘాన్నే ఎదురిస్తూ బాబు తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది.
    

Tags:    

Similar News