వరాల కుప్పం... ఎందుకంత నచ్చుతోంది...?

Update: 2022-03-31 03:30 GMT
చిత్తూరు జిల్లాలోని  ఉన్నది కుప్పం. ఈ పేరు చాలా మందికి ఇటీవల కాలం వరకూ తెలియదు. అసలు ఈ ప్రాంతం ఆంధ్రాలో ఉందా అన్న డౌట్ కూడా చాలా మందికి పుట్టుకొస్తుంది. కుప్పం  అటు కర్నాటక బోర్డర్ లో ఉంటుంది. ఏపీకి కడు దూరంగా విసిరేసినట్లుగా ఉంటుంది. అలాగే ఇటు  తమిళనాడు సరిహద్దులూ కలుస్తాయి. ఒక విధంగా కుప్పంలో మూడు రాష్ట్రాల కల్చర్ ఉంటుంది.

ఈ కుప్పం టీడీపీ అధినేత చంద్రబాబు డిస్కవరీ అనుకోవాలి. 1989 వరకూ ఇక్కడ నుంచి ఎవరు గెలిచినా అంత ప్రాముఖ్యత లేదు. కానీ చంద్రబాబు ఫస్ట్ టైం నాడు ఎమ్మెల్యేగా గెలిచారు 1994లో రెండవసారి గెలిచాక మొదటి ఎనిమిది నెలలూ మంత్రిగా, ఆ తరువాత ముఖ్యమంత్రిగా మారిపోయారు. ఇక విపక్ష నేతగా కూడా బాబు మారినా కుప్పాన్ని ఏనాడూ వదలలేదు.

అలాంటి కుప్పం 2019 ఎన్నికల వేళ మాత్రం చంద్రబాబు మెజారిటీని దారుణంగా తగ్గించేసింది. దాంతో వైసీపీ చూపు కుప్పం మీద పడింది. గత ఏడాది జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీలోని  మండలాలు పంచాయతీలు పెద్ద ఎత్తున వైసీపీ పరం అయ్యాయి. ఇక కుప్పాన్ని మునిసిపాలిటీగా చేసి వైసీపీ ఒక వరం నాడు ఇచ్చేసింది.

దాంతో తొలి మునిసిపాలిటీలో జెండా ఎగరేసింది. అది తమ ఘనతే అని చెప్పుకుంది. ఇపుడు ఏకంగా కొత్త జిల్లాల ఏర్పాటుతో కుప్పాన్ని రెవిన్యూ డివిజన్ చేసేసింది. ఇది రెండవ వరం. ఏపీలోని 22 పట్టణాలను రెవిన్యూ డివిజన్లుగా మారుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో కుప్పం కూడా ఉంది.

మొత్తానికి చూస్తే చంద్రబాబు సీటు అయిన కుప్పం వైసీపీకి బాగా నచ్చుతోంది. దాంతో వరస ప్రమోషన్స్ ఇస్తోంది. ఇదంతా రాజకీయమే మరి. బాబును ఎంత గారంగా చూసుకున్నా ఎన్ని సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినా కుప్పానికి ఏమీ చేయలేదని, తాను మాత్రం మునిసిపాలిటీ చేయడమే కాదు. రెవిన్యూ డివిజన్ హోదా కూడా ఇచ్చానని జగన్ చెప్పుకుంటారు అన్న మాట. మరి ఇన్ని చేసినా ఒప్పుల కుప్ప లాంటి కుప్పం వైసీపీ నీడన చేరుతుందా. చంద్రబాబుని కాదని వైసీపీ ఎమ్మెల్యే ఇక్కడ గెలుస్తాడా. ఏమో చూడాలి మరి.
Tags:    

Similar News