రిపేర్ల బాబూ ... పార్టీ మాటేంటి... ?

Update: 2021-10-07 15:30 GMT
చంద్రబాబుకు స్కోతర్ష ఎక్కువ అని అంతా అంటారు. ఆయన మంచి లీడర్.. ఆ విషయంలో రెండవ మాటకు చాన్స్ లేదు. కానీ ఆయన తన గురించి తాను చెప్పుకునే గొప్పలు అంతకు మించి ఉంటాయని కూడా ప్రత్యర్ధులు విమర్శలు చేస్తారు. ఏపీలో జగన్ కి పరిపాలనలో ఏ మాత్రం అనుభవం లేదని బాబు పదే పదే విమర్శలు చేస్తారు. కానీ జగన్ కరోనా రెండేళ్ల కాలంలో తీసుకున్న అనేక నిర్ణయాలు కానీ చేపట్టిన కార్యక్రమాలు కానీ ఆయనకు దేశంలో మంచి పేరు తెచ్చాయని ఇక్కడ చెప్పక తప్పదు. ఇక జగన్ మంత్రిగా కూడా పనిచేయకుండానే ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. చాలా మటుకు అవి జాతీయ స్థాయిలో చర్చకు వచ్చాయి. అయినా సరే బాబు దృష్టిలో మాత్రం జగన్ పాలనలో విఫలమైన వారికిందనే లెక్కట.

సరే తాజాగా బాబు పార్టీ నేతలతో మాట్లాడుతూ ఏపీలో వచ్చేది టీడీపీ సర్కారే అని ఘంటాపధంగా చెప్పేశారు. మరో రెండేళ్లలో మనమే అధికారంలోకి రాబోతున్నాం, ఇక మనం వచ్చిన వెంటనే ఏపీకి చాలానే రిపేర్లు చేయాలి అంటూ బాబు చెప్పుకొచ్చారు. ఏపీలో అన్ని రంగాలు పడకేసాయని, మొదటి నుంచి అంతా చేసుకుంటూ రావాలి. రిపేర్లు పెద్ద ఎత్తున చేయాలి అంటూ బాబు అంటున్నారు.

సరే ఒక పార్టీ తన పాలసీ ప్రకారం ప్రభుత్వం నడుపుతుంది. అది కచ్చితంగా మరో పార్టీకి నచ్చాలని అసలు లేదు. దాంతో ఒకవేళ బాబు చెప్పుకుంటున్నట్లుగా ఆయన టీడీపీ అధికారంలోకి వస్తే మొత్తానికి మొత్తం మార్చేయడం ఖాయం. సరే రిపేర్లు చాలా చేయాలి అంటున్న బాబు ముందు పార్టీ అధికారంలోకి వచ్చే మార్గం కూడా చూసుకోవాలి కదా అన్న సెటైర్లు బాగానే పడుతున్నాయి. పార్టీ ఒక వైపు పడకేసింది. లీడర్లు ఇంకా మత్తు వీడడం లేదు, మరి వారిని తట్టి లేపాలి, మెజారిటీ నియోజకవర్గాలో పార్టీని యాక్టివ్ చేయాలి. అందువల్ల బాబు చేయాల్సింది రేపటి రోజున అధికారంలోకి వస్తే ఏపీకి రిపేర్లు కాదు, ముందు పార్టీకి రిపేర్లు అంటున్నారు ట. కానీ చంద్రబాబు మాత్రం తానే రేపటి సీఎం అన్నట్లుగా ఏపీ కి కొత్త విజన్ ని ప్రకటించే పనిలో బిజీగా ఉన్నారు. మరి ఇలాగైతే ఎలా అన్నది తమ్ముళ్ల గోల అంటే అర్ధం చేసుకోవాల్సిందే కదా.
Tags:    

Similar News