ఏపీ సీఎం జగన్‌పై ప్రజల్లో తీవ్రమైన తిరుగుబాటు వచ్చేసిందని.. దీనిని ఎవరూ ఆపలేరని.. టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జగన్ లాంటి నియంతలకు తాను భయపడబోనని చెప్పారు. జగన్ చెప్పిన రాయలసీమ ఎత్తిపోతల ఏమైందని ప్రశ్నించారు. కడపలో జరిగిన జిల్లా స్థాయి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో బాబు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసిందని ఇక వారిని ఎవరూ ఆపలేరన్నారు. జగన్ ఓటమిని రాసుపెట్టుకోవాలని.. సవాల్ రువ్వారు.
మూడేళ్ల జగన్ పాలన పూర్తి వైఫల్యంగా సాగిందని చంద్రబాబు మండిపడ్డారు. అందరిపై బాదుడే బాదుడుతో మోయలేని భారం మోపుతున్నారని విమర్శించారు. కడపలో జరిగిన జిల్లా స్థాయి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన.. ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసిందని ఇక వారిని ఎవరూ ఆపలేరన్నారు.
జగన్ లాంటి నియంతలకు తాను భయపడనని అన్నారు. టీడీపీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ దోపిడిని వివరించాలన్నారు. దొంగ లెక్కలు రాయటం.. దొరికిపోవటం జగన్ తీరని ఎద్దేవా చేసిన చంద్రబాబు..అప్పులతో రాష్ట్ర పరువు తీస్తున్నారని ఆక్షేపించారు.
గుంటూరుకు చెందిన వెంకాయమ్మ ప్రభుత్వ తీరుపై వాస్తవాలు చెబితే ఆమె ఇంటిపై దాడి చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థుల్లో ఇద్దరు టీడీపీ నుంచి వెళ్లినవాళ్లే ఉన్నారన్నారు.
సీబీఐ కేసుల్లో తనతో ఉన్నవారితో పాటు, కేసులు వాదించిన వారికి జగన్ రాజ్యసభ సీట్లు ఆఫర్ చేశారని ఆక్షేపించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇద్దరిని రాజ్యసభకు పంపుతున్నారని.., రాజ్యసభకు పంపేందుకు ఏపీలో సమర్థులు లేరా ? అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
''ఒంగోలులో మహానాడుకు స్టేడియం ఎందుకివ్వలేదు. కడపలో అభివృద్ధికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా ?. కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ దోపిడీని వివరించాలి. జగన్ చెప్పిన రాయలసీమ ఎత్తిపోతల ఏమైంది. పులివెందులలో బస్టాండ్ కట్టలేనివాళ్లు 3 రాజధానులు కడతారా ?. పులివెందులలో రైతులకు బీమా ఎందుకు రావడం లేదు. బైక్‌పై మృతదేహాన్ని తరలిస్తే సీఎం కనీసం స్పందించారా ?. అత్యాచార బాధితులను కనీసం పరామర్శించారా ?. కడప విమానాశ్రయం వద్ద కార్యకర్తలపై ఆంక్షలా'' అని చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.