టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికల కోసం అపుడే కసరత్తు మొదలెట్టేశారు. మొత్తం 175 అసెంబ్లీ సీట్ల మీద నివేదికలు తెప్పించుకుని మరీ ఆయన క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. అదే టైమ్ లో తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలి అన్న దాని మీద చంద్రబాబు మధనం చేస్తున్నారు. చంద్రబాబు మొదటి సారి చంద్రగిరి నుంచి పోటీ చేసి 1978లో గెలిచారు. అదే సీటు నుంచి 1983లో కాంగ్రెస్ తరఫున మంత్రిగా పోటీ పడి అపుడే మామ ఎన్టీయార్ పెట్టిన టీడీపీ చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత 1985లో బాబు ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇక 1989 ఎన్నికల నాటికి బాబు కుప్పం కి మకాం మార్చేశారు. దాంతో బాబుకు కుప్పంతో వీడని బంధం ఏర్పడింది.
ఇవన్నీ ఇలా ఉంటే వచ్చే ఎన్నికలలో చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్న చర్చ పార్టీలో కూడా ఉంది. నిజానికి ఈ చర్చ రావడానికి కారణం నానాటికీ కుప్పంలో టీడీపీ బలహీనం అవుతూండడమే. వైసీపీ అధికారంలోకి వచ్చాక కుప్పంలో లోకల్ బాడీ ఎన్నికలతో సహా అన్నింటినీ కైవశం చేసుకుని బలంగా తయారైంది. దాంతో ఈసారి చంద్రబాబుని ఓడించడానికి వైసీపీ గట్టిగానే ప్రయత్నం చేస్తోంది అన్న టాక్ కూడా ఉంది.
ఈ నేపధ్యంలో చంద్రబాబు కుప్పం సీటు నుంచి బయటపడి వేరే చోటు ఎంచుకుంటారని అంటున్నారు. ఈ క్రేమంలో విశాఖ నుంచి టీడీపీ తమ్ముళ్ళు చంద్రబాబుని ఉత్తరాంధ్రా నుంచి పోటీ చేయమని కోరుతున్నారుట. ఉత్తరాంధ్రాకు ముఖ ద్వారంగా ఉన్న విశాఖ నుంచి బాబు పోటీ చేస్తే మూడు జిల్లాల్లో మంచి ఊపు వస్తుంది, పార్టీకి కూడా ప్లస్ అవుతుంది అని సూచిస్తున్నారుట. నిజానికి విశాఖ సిటీ టీడీపీకి కంచుకోట. దాంతో బాబు కూడా ఆలోచిస్తున్నారు అంటున్నారు. కుప్పం సీటుతో పాటు విశాఖ సిటీ నుంచి ఏదో చోటు నుంచి పోటీకి బాబు రెడీ అంటున్నారు. విశాఖ నార్త్ నుంచైనా, లేక భీమిలీ నుంచి అయినా బాబు పోటీ చేయడం ఖాయమని అంటున్నారు. మరి చూడాలి బాబు విశాఖ వస్తే ఉత్తరాంధ్రా మీద వైసీపీ వ్యూహం ఎలా ఉంటుందో.