భారీ భ్రమలలో చంద్రబాబు .. ?

Update: 2021-07-24 08:30 GMT
వ్యూహాలు అన్నీ నాకే తెలుసు. నేనే అపర చాణక్యుడిని ని అంటూ ఉంటారు చంద్రబాబు. కానీ రోజులు మారాయి బాబూ అంటున్నారు ప్రజలు. చంద్రబాబు వ్యవస్థలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తారు తప్ప ఈ రోజుకూ జనంలో బలం పెంచుకోవడంలేదన్న కామెంట్స్ అయితే టీడీపీలోనే ఉన్నాయి. కానీ జగన్ అన్న వ్యక్తి తన ఎదురుగా లేకపోతే ఏపీలో తనదే విజయం అని బాబు ఈ రోజుకీ నమ్ముతున్నారు. జగన్ జైలుకు పోతే వైసీపీ కుదేల్ అవుతుంది అని తనకు రాజకీయంగా అవకాశం వస్తుంది అని ఆయన భావిస్తున్నారు. కానీ జగన్ జైలుకు వెళ్తే ఆయనకు ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి. ప్రజలు సానుభూతితో మళ్ళీ ఆయన్నే గెలిపిస్తారు అన్నది మాత్రం ఆయన తెలుసుకోలేకపోతున్నారు అంటున్నారు విశ్లేషకులు.

ఇక చంద్రబాబుకు ఉన్న మరో భ్రాంతి భ్రమ ఏమిటీ అంటే బీజేపీతో కలిస్తే అధికారంలోకి వస్తాను అని. అది 2019 ఎన్నికల మాట. నాడు మోడీకి ఉన్న క్రేజూ, మోజూ వేరు. మోడీని నాడు తన అతి తెలివితో దూరం చేసుకున్న చంద్రబాబు 2024 ఎన్నికల్లో మాత్రం జట్టు కట్టాలని గట్టిగానే అనుకుంటున్నారు. అయితే ఇప్పటికే బీజేపీ మీద దేశంలో విపరీతంగా వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. మోడీ గ్రాఫ్ కూడా బాగా పడిపోయింది. కానీ బాబు ఎందుకో ఆ సంగతి గ్రహించడంలేదని తమ్ముళ్ళు అంటున్నారు. బాబు యాంటీ మోడీ టీమ్ లో ఈ టైమ్ లో చేరితేనే ప్రయోజనం ఏమైనా ఉంటుంది తప్ప మోడీ తో కూడితే ఏం జరుగుతుంది అన్నది వారి వాదన.

ఇక పవన్ కళ్యాణ్ తన వెంట ఉంటే గెలుపు ఖాయమని బాబు ఇంకో భ్రమను పెంచుకున్నారు. అయితే 2014 నాటి పవన్ కళ్యాణ్ వేరు, 2024 నాటికి పవన్ వేరు అన్నది కూడా ఒక విశ్లేషణ. 2014లో పవన్ ఫ్రెష్. ఆయన రాజకీయాలకు కొత్త కావడంతో యూత్ తో పాటు అందరూ ఆయన చెప్పిన మాట విని టీడీపీకి ఓటేశారు. ఈ ఏడేళ్ల గ్యాప్ లో పవన్ చాలా పార్టీలతో పొత్తులు పెట్టుకుని విడిపోయారు. రాజకీయాలను ఆయన ఈ రోజుకీ సీరియస్ గా తీసుకోవడంలేదు. ఆయనకు నిలకడ లేదని కూడా అంతా గ్రహించారు.

గా ఆయన చంద్రబాబుని, లోకేష్ ని నానా మాటలు 2019 ఎన్నికల ముందు అన్నారు. ఇపుడు అన్నీ మరచి టీడీపీ జనసేన కలిసినా జనాలు మాత్రం ఓటేసేందుకు సిద్ధంగా ఉండరు అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు భ్రమల నుంచి బయటకు వచ్చి సొంతంగా రాజకీయం మొదలుపెడితే తప్ప టీడీపీ బతికి బట్టకట్టదు అంటున్నారు.




Tags:    

Similar News