విజయవాడలో ఆరంభమైన ప్రతిష్టాత్మక మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గౌతమీపుత్ర శాతకర్ణి ప్రస్తావన తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. శుక్రవారం సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు తెలుగు చరిత్ర గురించి చెబుతూ శాతకర్ణి గురించి మాట్లాడారు. శాతకర్ణి తన తల్లికి ఇచ్చిన ప్రాధాన్యం గురించి ఆయన ప్రస్తావించారు.
‘‘ఆంధ్రప్రదేశ్ కు గొప్ప చరిత్ర ఉంది. ఇక్కడ మహిళలకు ఎప్పుడూ గొప్ప గౌరవం దక్కింది. 2 వేల ఏళ్ల కిందట శాతవాహనులు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మొత్తం భారత దేశాన్ని.. కొన్ని విదేశీ ప్రాంతాల్ని కూడా పాలించారు. అప్పటి చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి తన పేరును తల్లి పేరు కలిసొచ్చేలా మార్చుకున్నాడు. ఆమెకు గొప్ప గౌరవాన్నిచ్చాడు. ఇదీ ఆంధ్రప్రదేశ్ ఘనచరిత్ర’’ అని చంద్రబాబు అన్నారు.
తొలి మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు ఘనచరిత్ర ఉన్న విజయవాడలో జరుగుతుండటం పట్ల చంద్రబాబు హర్షం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ ఎస్ ఎంపీ కవిత ప్రసంగించబోతుండటం విశేషం. ఆమె ఏపీలో ఒక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనుండటం ఇదే తొలిసారి కావచ్చేమో. అలాగే చంద్రబాబు కోడలు.. హెరిటేజ్ ఫుడ్స్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రహ్మణి కూడా ఈ సదస్సులో ప్రసంగం చేయనుండటం మరో విశేషం.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/