ప్రభుత్వాన్ని నడిపించిన అనుభవం లేనోళ్లు అయితే కొన్ని విషయాల్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. ప్రభుత్వాధినేతగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన నేతకు.. ఒక సభను నిర్వహించే సమయంలో తీసుకోవాల్సిన అనుమతుల గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరమే ఉండదు. కానీ.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ప్రతి విషయం కొత్త గా చెప్పాల్సిందే.
ఈ రోజు బాబు కడప కు వెళ్లనున్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరి ఆర్నెల్లు కాక ముందే.. జిల్లాల వారీగా పర్యటిస్తూ ఆగమాగం చేస్తున్న సంగతి తెలిసిందే. వర్షాలు.. వరదల కారణంగా ఇసుక కొరత ఏర్పడితే దానికి బాబు చేసిన ఆరాచకం అంతా ఇంతా కాదు. జగన్ ప్రభుత్వం చేపట్టిన చర్యల తో ఇప్పుడు ఏపీ లో ఇసుక కొరత లేదు. దీంతో.. ఏం చేయాలో తోచని పరిస్థితి.
అనునిత్యం ఏదో బిజీగా ఉన్నట్లుగా బిల్డప్ ఇస్తూ.. ప్రజల మధ్య తిరుగుతుండే చంద్రబాబు ఇప్పుడు కడపలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీలు.. తోరణాలు ఏర్పాటు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన వీటిని కడప నగరపాలక సంస్థ తొలగించింది. దీంతో.. పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనల్ని అనుసరించి అనుమతులు తీసుకోవాల్సింది తీసుకోకుండా ఇష్టారాజ్యం గా వ్యవహరిస్తూ.. తామేం చేసినా చూస్తూ ఊరుకుండి పోవాలన్నట్లుగా చేస్తున్న తెలుగు తమ్ముళ్ల తీరు పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తీరు కక్షపూరిత చర్యగా అభివర్ణిస్తున్న వైనం చూస్తే.. కెలికి మరీ గోల చేసి.. దాంతో పొలిటికల్ మైలేజీ పొందాలన్న ధ్యాస తప్పించి మరింకేమీ లేదన్న భావన కలుగక మానదు.