ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ప్రసంగించడం అంటే చాలా ఇష్టం. అందులోనూ తనకు ఇష్టమైన అంశం దొరికిందంటే...వినే వారికి చాలా ఓపిక కావాల్సిందే. బాబుకు ఇష్టమైన అంశాలు గతంలో అయితే ప్రపంచీకరణ, టెక్నాలజీ వంటివి. మరిప్పుడు? నదుల అనుసంధానం, రాజధాని అమరావతి నిర్మాణం వంటివి. తన జీవిత కాల లక్ష్యమని బాబు చెప్పుకొనే అమరావతి నిర్మాణం గురించి తాజాగా జరిగిన సమావేశంలో బాబు ఓ రేంజ్ లో చెప్పేశారు. అమరావతి నగర పరిధిలోని 7 ప్రధాన రహాదారుల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉగాది రోజున శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఒలింపిక్స్ స్థాయి క్రీడల పోటీల నిర్వహణకు అనుగుణమైన మౌలిక సదుపాయాలు ఇంతవరకు ఎక్కడ లేవని అన్నారు. తొలిసారిగా అమరావతిలోని క్రీడా నగరంలో ఆ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు ఇక్కడే ఒలింపిక్స్ ను నిర్వహించి ఆంధ్రప్రదేశ్ సత్తా ప్రపంచానికి చాటుతామని ప్రకటించారు. 2019-20లో జరిగే కామన్ వెల్త్ క్రీడాలను కూడా ఇక్కడే నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు.
అమరావతి నగరంలో ప్రపంచ స్థాయి పౌర సదుపాయలను కల్పిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. అందులో భాగంగానే ఈ కీలక రహదారులని వివరించారు. సుమారు 915కోట్ల వ్యయంతో ఈ రహాదారులు నిర్మిస్తామని, ఇవి పూర్తయితే నగరంలోని ప్రధాన ప్రాంతాలన్నింటికి మార్గాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అలాగే 5 జాతీయ, 9 రాష్ట్ర స్థాయి రహదారులతో ఇవి అనుసంధానమౌతాయని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. చారిత్రాత్మక వారసత్వ సంపదను భవిష్యత్తు తరాలకు అందిస్తునే అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాన్ని ఇక్కడ వినియోగిస్తున్నామన్నారు. అడ్డగోలు విభజన చేసిన కాంగ్రెస్ కొత్త రాజధాని నగరాన్ని ఎక్కడ కట్టుకోవాలో కూడా చెప్పలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా తాను నగర నిర్మాణానికి అవసరమైన స్థల ఎంపిక కోసం ప్రయత్ని స్తుంటే అనేక రకాలుగా విపక్షాలు అడ్డం తగిలాయన్నారు. రాష్ట్రంలోని అందరికీ అందుబాటులో ఉంటుందన్న ఉద్దేశంతోనే ఇక్కడ రాజధాని నగరాన్ని ప్రతిపాదించామన్నారు.
తనకే స్వార్థం ఉంటే తిరుపతిలో తన ఇంటి ముందే రాజధాని నగరాన్ని నిర్మించుకోని ఉండేవాడినని చంద్రబాబు అన్నారు. తిరుపతిలో 10,000 ఎకరాల ప్రభుత్వ భూములు కూడా అందుబాటులో ఉన్నాయని అయినా తాను ముందుకు పోలేదన్నారు. ఇక్కడ నగర నిర్మాణానికి ప్రజలందరి మద్దతు లభిస్తుందన్నారు. ముఖ్యంగా స్థానిక రైతులు తనపై విశ్వాసముంచి 34 వేల ఎకరాల భూములను ఉచితంగా అందించారన్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో కొండవీటి వాగు ముంపు ఉండేదన్నారు. ఇక ముందు ఆ ప్రమాదం కొనసాగదని చంద్రబాబు చెప్పారు. అత్యాద్భుత రీతిలో 9 అంతర్గత నగరాల నిర్మాణాన్ని ఇక్కడ చేపడుతున్నామన్నారు. ఇప్పటికే బెజవాడ చుట్టుప్రక్కల భూములకు విపరీతమైన గిరాకీ ఏర్పడిందన్నారు. ఇక్కడ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న విశ్వాసం అందరిలో నెలకొందని చంద్రబాబు అన్నారు. ప్రజలను భయబ్రాంతులను చేసేందుకు ప్రతిపక్షాలు ఎంత ప్రయత్నించిన వారిని నమ్మడం లేదన్నారు. తాను ముందునుంచి అమరావతి విషయంలో ఒక స్పష్టమైన దృక్పధం ఉన్నట్లు చెప్పారు. కేవలం 192 రోజుల్లో అత్యాద్భుతమైన అసెంబ్లీ భవనాన్ని నిర్మించి చూపించడంతో విపక్షాలకు నోట మాట రావడం లేదని చంద్రబాబు అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/