టీడీపీ చేసింది చెప్పుకుంటుంది - వైసీపీ చేయబోయేది చెప్తోంది

Update: 2019-04-04 01:30 GMT
జీవితంలో అయినా రాజకీయాల్లో అయినా రాబోయే కాలానికి, ఇవ్వబోయే వాగ్దానానికి వేల్యూ ఎక్కువ. ప్రజలకు చేసింది గుర్తుపెట్టుకోవడం కంటే.. రాబోయే రోజుల్లో తమకు ఏం చేస్తారు అనేదానిపైనే ఎక్కువుగా ఫోకస్‌ పెడతారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏం చేస్తారు, ఏం మేలు జరుగుతుంది అని మాత్రమే ప్రతీ ఒక్కరూ పట్టించుకుంటారు. ఈ చిన్న లాజిక్‌ని మిస్‌ అయిన టీడీపీ ఎన్నికల హడావుడి మొదలైన దగ్గరనుంచి నాన్‌ స్టాప్ యాడ్స్‌ తో సొంత డబ్బా కొట్టుకుంటూనే ఉంది.
   
ఎన్నికలకు ఇంకా వారం రోజులే సమయం ఉంది. తాము అధికారంలోకి వస్తే ఏపీ ప్రజలకు ఏం చేస్తామో టీడీపీ ఇంతవరకు చెప్పలేదు. ఎన్నికల హడావుడి మొదలైన దగ్గరనుంచి ఈ ఐదేళ్లలో తాము ఏం చేసిందీ, ఎంత ఖర్చుపెట్టింది అనే దాని గురించే చెప్పుకుంటుంది. టీడీపీ ఇప్పటివరకు దాదాపు 17 యాడ్స్‌ చేసింది. అన్ని యాడ్స్‌ లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశారో చెప్తున్నారో తప్ప.. ఈసారి అధికారంలోకి వస్తే ఏం చెస్తారు అనే విషయాన్ని చెప్పడం లేదు. పసుపు కుంకుమ - చంద్రన్న బీమా.. ఇలా సొంత పథకాలకు సొంత డబ్బా కొట్టుకుంటున్నట్లుగా యాడ్స్‌ ఉంటున్నాయి.
   
అదే జగన్‌ విషయానికి వస్తే.. సూటిగా సుత్తి లేకుండా యాడ్స్‌ ఉంటున్నాయి. మొన్నటివరకు తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో - ఎలాంటి పథకాలు ప్రవేశపెడతానో చెప్తూ వస్తున్నారు జగన్‌. పసిపిల్లలు బడికి వెళ్తే ఏడాదికి రూ.15 వేలు ఇస్తానని చెప్పిన యాడ్‌ అందర్ని ఆకట్టుకుంది. ఇక రావాలి జగన్‌ - కావాలి జగన్‌ సాంగ్‌ సూపర్‌ హిట్ అవ్వడంతో... వైసీపీ యాడ్స్‌ కూడా బాగా పాపులర్‌ అయ్యాయి. సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతున్నాయి. ఇక ఇవాళ్టి నుంచి వైసీపీ కూడా టీడీపీ తరహా యాడ్స్‌ ని కొన్ని రూపొందించింది. ఇందులో కూడా తాను ధికారంలోకి వస్తే ఏం చేస్తాడో చెప్పుకొచ్చారు జగన్‌. మొత్తానికి చంద్రబాబు చేసింది చెప్పుకుంటంటే జగన్‌ మాత్రం చేయబోయేది చెప్తున్నారు. మరి ప్రజలు ఎవరి పక్షాల నిలబడతారో.
Tags:    

Similar News