మళ్లీ ఇద్దరు చంద్రుల భేటీ?

Update: 2017-04-15 06:53 GMT
ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లు వచ్చే సోమవారం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వారు సమావేశమవుతున్నారని సమాచారం.  గవర్నర్ నరసింహన్ సారథ్యంలో సోమవారం వీరి భేటీ ఏర్పాటైనట్లుగా చెబుతున్నారు.
    
ప్రధానంగా విభజన సమస్యలపైనే చర్చిస్తారని... ఏపీ సచివాలయ భవనాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడం తదితర అంశాలపై ఒక నిర్ణయానికి రావొచ్చని తెలుస్తోంది.  విద్యుత్ - సచివాలయ ఉద్యోగుల విభజన - అస్తుల పంపకంపై చర్చించనున్నట్టు సమాచారం. ఇవే అంశాలపై గవర్నర్ నరసింహన్ ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల మంత్రులు ఇప్పటి వరకు మూడుసార్లు చర్చించారు. ఆ చర్చల్లో తేలిన అంశాలను మంత్రులు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నివేదించారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు, కేసీఆర్ కలిసి గవర్నర్ సమక్షంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
    
అలాగే... చంద్రబాబు ఇటీవల నిర్మించిన కొత్త ఇంటి వద్ద భద్రత విషయంపైనా మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ ప్రస్తుతం ఏపీ పోలీసులే భద్రత చూస్తున్నారు. అది అలాగే కొనసాగిస్తూ తెలంగాణ పోలీసుల సహకారం, నిఘా కూడా ఉండేలా కేసీఆర్ ను చంద్రబాబు కోరనున్నట్లు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి సమస్యలు ఉన్నా, హైదరాబాద్ కు పదేళ్ల ఉమ్మడి రాజధాని గడువు ముగిసినా కూడా కేసీఆర్ అండ్ కో పాలనలో ఈ విషయంలో సహకారం అందేలా మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News