రెండు తెలుగురాష్ట్రాల మధ్య నడుస్తున్న నీళ్ల పంచాయితీల లెక్క తేల్చేందుకు కేంద్రం ముందుకు రావటం తెలిసిందే. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి రావాలంటూ కేంద్రమంత్రి ఉమాభారతి ఆహ్వానించారు. ఇందుకోసం ఈ నెలలో మూడు రోజుల్లో ఏదో ఒక తేదీని చెప్పాలని కోరారు. ఇందుకోసం 11..18..19 తేదీల్లో ఒక తేదీని చెప్పమని కోరారు. దీనికి ఇద్దరు చంద్రుళ్లు ఎలా రియాక్ట్ అయ్యారన్నది చూస్తే ఆసక్తికరంగా ఉంటుందనే చెప్పాలి.
ఇద్దరి మధ్య పంచాయితీ నడుస్తున్న వేళ.. వారి మధ్యనున్నసమస్యను పరిష్కరించేందుకు పెద్ద మనిషి ముందుకు వస్తే ఎలా రియాక్ట్ కావాలి? పెద్ద మనిషికి అనుకూలంగా ఉన్న తేదీల్లో ఒక దానికి ఓకే చెప్పాలి. తాజా ఎపిసోడ్ ను చూస్తే.. ఈ యవ్వారమే వేరుగా అనిపిస్తుంది. జలవివాదాల పరిష్కారానికి కూర్చోవాల్సిన ముఖ్యమంత్రుల ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం అన్నది ఎంత కష్టమన్న విషయం.. ‘పంచాయితీ’ కోసం వారు చెప్పిన తేదీల్ని చూస్తేనే అర్థమవుతుంది.
కేంద్రమంత్రి మూడు తేదీల్ని ఇచ్చి.. మీకు అనుకూలంగా ఉన్న డేట్ ను ఎంపిక చేసుకొమ్మని అడిగితే.. ఏపీ ముఖ్యమంత్రి తనకు 19వ తేదీ ఓకే అని చెప్పారు. కేంద్రమంత్రి ఉమాభారతి ప్రతిపాదించిన తేదీల్లో ఒక దాన్ని ఎంపిక చేసుకున్న చంద్రబాబు.. ఆ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే ముందే ఓకే చెప్పేశారు. బాబు నోటి నుంచి యస్ అన్న మాట వచ్చిన తర్వాత కేసీఆర్ స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. చివరకు కేసీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. కాకుంటే.. కేంద్రమంత్రి చెప్పిన మూడు తేదీలు తనకు కుదరవన్న విషయాన్ని నేరుగా చెప్పని ఆయన.. తనకు ఈ నెల 21న ఓకే అన్న విషయాన్ని చెప్పారు.
కేంద్రమంత్రి ప్రతిపాదించిన మూడు తేదీల్లో ఒక దాన్ని ఎంపిక చేసుకోని కేసీఆర్.. తనకు వీలైన తేదీని చెప్పటం తప్పు కాదు. తన మాదిరే కేంద్ర మంత్రికి కానీ.. ఏపీ ముఖ్యమంత్రికి కానీ వీలవుతుందా? లేదా? అన్నది ఆలోచించని వైనం కనిపిస్తుంది. మూడు తేదీల్లో తనకు ఏ ఒక్కటీ అనుకూలంగా లేనప్పుడు.. తనకు వీలైన తేదీలు చెప్పేటప్పుడు కనీసం రెండు.. మూడైనా ప్రతిపాదించాల్సిన అవసరం ఉంది. అలాంటిదేమీ లేకుండా కేసీఆర్ ఒక్క తేదీనే చెప్పటం గమనార్హం. ఇలాంటప్పుడు కేసీఆర్ కు కుదిరిన రోజున.. కేంద్రమంత్రికి.. ఏపీ ముఖ్యమంత్రికి కుదురుతుందా? అన్నది ఒక ప్రశ్న. ఈ ఎపిసోడ్ ను చూసినప్పుడు అర్థమయ్యేది ఒక్కటే. డేట్ విషయంలోనే ఇద్దరు చంద్రుళ్ల మధ్య పొసగని వేళ.. కూర్చొని వివాదాల్ని పరిష్కరించుకోవటం అయ్యే పనేనా? అన్న సందేహం కలగకమానదు.