మోడీ అన్న‌ల్లా తెలుగు త‌మ్ముళ్లు మారారా?

Update: 2018-11-07 05:48 GMT
అప్పుడ‌ప్పుడు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు కోపం వ‌స్తూ ఉంటుంది. ఆ సంద‌ర్భంగా పార్టీ నేత‌ల‌పై ఆయ‌న విరుచుకుప‌డుతుంటారు. చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ హెచ్చ‌రిక‌లు చేస్తారు. ఇలాంటి హ‌డావుడి మాట‌లే కానీ ఇప్ప‌టివ‌ర‌కూ ఆయ‌న చ‌ర్య‌లు తీసుకున్న‌దే లేదు. త‌మ్ముళ్ల‌ను ఉరికించ‌టానికి.. వారిని అలెర్ట్ చేయ‌టానికి.. త‌న కోపాన్ని ప్ర‌ద‌ర్శించ‌టానికే ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తుంటారే త‌ప్పించి మ‌రే కార‌ణం ఉండ‌ద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇంత‌కీ బాబుకు త‌మ్ముళ్ల మీద ఉన్న‌ట్లుండి ఎందుకు కోపం వ‌చ్చిన‌ట్లు?  దానికి కార‌ణం ఏమిట‌న్న‌ది చూస్తే.. ఇప్పుడు బాబు ఎజెండా ఒక్క‌టే. అది కేంద్రం మీదా.. దాని తీరు మీదా నిర‌స‌న వ్య‌క్తం చేసే ఏ చిన్న కార‌ణాన్ని మిస్ కాకూడ‌దు. తాజాగా ఏపీపై కేంద్రం వైఖ‌రికి నిర‌స‌న తెల‌పాలంటూ బాబు డిసైడ్ చేశారు. ఇందులో భాగంగా 12 మంత్రుల నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు మొత్తం 67 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో నిర‌స‌న చేప‌ట్టాల‌ని డిసైడ్ చేశారు.

అయితే.. బాబు మాట‌ల్ని తెలుగు త‌మ్ముళ్లు లైట్ తీసుకున్నారు. నిర‌స‌న కార్య‌క్ర‌మాల్ని చేప‌ట్టాల‌న్న అధినేత ఆదేశాల్ని ప‌ట్టించుకోలేదు. దీంతో.. బాబుకు కోపం వ‌చ్చింది. ప్ర‌జ‌ల్లో ఉండాల‌నుకుంటున్నారా?  లేదా?  ప్ర‌జ‌ల్లో తిర‌గ‌కుంటే ప‌క్క‌కు త‌ప్పుకోండి.. లేదంటే నేనే త‌ప్పిస్తానంటూ ఆయ‌న క‌టువుగా హెచ్చ‌రించ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసిన ఆయ‌న.. త‌న స‌హ‌జ‌శైలికి భిన్న‌మైన వ్యాఖ్య‌ల్ని చేయ‌టం విశేషం.

కొంత‌మంది ఎమ్మెల్యేలు ప్ర‌జ‌ల్లో తిరిగితే గ్లామ‌ర్ త‌గ్గిపోతుంద‌ని భావిస్తున్నార‌ని.. కందిపోకూడ‌ద‌ని అనుకుంటే అస‌లుకే మునిగిపోతార‌ని హెచ్చ‌రించారు.  చాలామంది పూర్తిస్థాయిలో ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌టం లేద‌ని.. జ‌నంతో మ‌మేకం కావాల‌నుకోవ‌టం రాజ‌కీయ నాయ‌కుల ల‌క్ష‌ణ‌మ‌న్న బాబు.. గ్లామ‌ర‌స్ గా ఉండాల‌నుకుంటే వేరే రంగాల్లోకి వెళ్లాలంటూ వ్యంగ్య వ్యాఖ్య‌లు చేశారు. మొత్తంగా బాబు మాట‌ల్ని చూస్తే.. త‌న మాట‌ల్ని ఎమ్మెల్యేలు ప‌ట్టించుకోవ‌టం లేద‌న్న ఆగ్ర‌హం బాబులో క‌నిపిస్తుంది. అధికారం చేతిలో ఉన్న అధినేత మాట‌ను ఎమ్మెల్యేలు లైట్ తీసుకోవ‌టం.. దీనిపై బాబే స్వ‌యంగా వాపోవ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News