నోరూరించే వంటకంలో పంటికింద ఒక్క రాయి పడితే చాలు వండిన కష్టమంతా నిష్ఫలమవుతుంది.... మల్లె పువ్వు వంటి తెల్లని చొక్కాపై పడిన ఒక్క సిరా చుక్క చాలు దాని అందమంతా పాడుచేయడానికి.... ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు పరిస్థితి అలానే ఉంది. పన్నెండేళ్లకోసారి వచ్చే గోదారి పుష్కరాలు ఈసారి 144 ఏళ్ల తరువాత వచ్చిన మహాపుష్కరాలు కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దేశంలో అతిపెద్ద ఈవెంట్ అయిన కుంభమేళాకు ధీటుగా దీన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కుంభమేళాను ఎలా నిర్వహిస్తారో అధ్యయనం చేయడానికి ఓ నిపుణుల బృందాన్ని పంపించి.. వారి నివేదిక ఆధారంగా అంతకంటే మెరుగైన సౌకర్యాలు ఏర్పాట్లుతో పుష్కరాలు నిర్వహించడానికి చంద్రబాబు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఏపీలో జరుగుతున్న పుష్కరాల్లో భక్తులకు ఏ చిన్న అవసరానికీ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు అత్యద్భుతంగా ఉన్నాయి.... అయితే.... తొలిరోజే జరిగిన తొక్కిసలాట ప్రమాదం కారణంగా ఈ ఘనమైన ఏర్పాట్లన్నీ చిన్నవిషయాలుగా మారిపోయాయి. ఆ ప్రమాదమే జరగకుంటే పుష్కరాలకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు ప్రపంచవ్యాప్తంగా మార్మోగేవి. ఎందుకంటే... ఇవి నిజంగానే కనీవినీ ఎరుగని ఏర్పాట్లే.. రాజమండ్రిలో పుష్కరాలకు చేసిన ఏర్పాట్లను 'తుపాకీ' బృందం స్వయంగా పరిశీలించింది. ఆ వివరాలివీ..
లక్షల మంది వచ్చే భారీ కార్యక్రమాల్లో ఎన్నో అసౌకర్యాలు కలుగుతాయి. కానీ.... రాజమండ్రిలో పుష్కర భక్తులకు ఏ అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేశారు. రోజుకు లక్షల మంది వస్తున్నా అక్కడ తాగునీటికి కొరత లేదు. అడుగడుగునా మంచినీరు సరఫరా చేస్తున్నారు. ఉచిత సరఫరా కొంతయితే.. చాలా తక్కువ ధరకే సీసాల్లో నీరు కూడా ఇస్తున్నారు. ఇక భోజనం విషయానికొస్తే.... స్వయంగా వండుకునే భక్తుల కోసం రెడీమేడ్ గా సరకుల కిట్లు లెక్కలేనన్ని రెడీగా ఉన్నాయి. నాలుగడుగులు వేస్తే చాలు టాయిలెట్లు కనిపిస్తున్నాయి.... పుష్కర రేవులో స్నానం చేసే మహిళలు దుస్తులు మార్చుకోవడానికి అక్కడే గదులున్నాయి.
పారిశుద్ధ్య నిర్వహణ అంటే అలా ఉండాలి..
పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించడంతో పాటు పిండప్రదానాలూ చేస్తారు. వీరికోసం పిండప్రదానానికి అవసరమైన సరకులు సిద్ధంగా ఉంచారు. పిండప్రదానం కిట్ కేవలం రూ.50కే దొరుకుతోంది. వీటికి కూడా ఎక్కడా కొరత లేదు. అంతేకాదు... నదిలో పిండప్రదానం చేయగానే వెంటనే సెకన్ల వ్యవధిలోనే దాన్ని తొలగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల నదిలో వ్యర్థాలు పేరుకుపోయి కాలుష్యం ఏర్పడే పరిస్థితే లేదు. అవేకాదు... భక్తులు ఎక్కడ ఒక అరటి పండు తొక్క వేసినా వెంటనే దాన్ని తీసి చెత్తబుట్లలో వేస్తున్నారు అక్కడున్న సిబ్బంది.
ఈ కాలంలో ఇంత మర్యాదా..?
ఇక భక్తులతో పోలీసులు, అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే మనం 2015లోనే ఉన్నామా... లేకుంటే రెండు మూడు సహస్రాల కిందట కాలమా అనిపించక మానదు. రోజంతా ఎండలో నిలబడి లక్షల మంది భక్తుల మధ్య కిక్కిరిసిపోతూ నిమిషం ఖాళీ లేకుండా సేవలందిస్తున్న అన్ని రకాల సిబ్బంది కూడా ఎక్కడా విసుగు, కోపం, చిరాకులాంటివి తమ దరికి చేరనివ్వకపోవడం విశేషం. భక్తులకు ఎలాంటి సహాయమైనా చిరునవ్వుతోనే చేస్తున్నారు. భక్తులు తమతో దురుసుగా వ్యవహరించినా కూడా వారు తొణక్కుండా బెణక్కుండా అదే చిరునవ్వుతో వారికి సమాధానమిస్తున్నారు.. సాయపడుతున్నారు.
మొత్తానికి రాజమండ్రి పుష్కరాలు భారతదేశంలో జరిగే అతిపెద్ద ఉత్సవం కుంభమేళాను తలదన్నేలా జరిగాయి... కానీ... తొలిరోజున తొక్కిసలాట కారణంగా 27 మంది మృతిచెందడంతో ఈ ఘనత అంతా మరుగునపడిపోయింది. ఆ ఘటనే కానీ జరగకుంటే చంద్రబాబు చరిత్ర సృష్టించారని విమర్శకులూ ఒప్పుకొని తీరేవారు.