బాబులో గెలుపు ధీమా లేద‌న‌టానికి ఈ నిర్ణ‌యం చాలు!

Update: 2019-05-15 06:03 GMT
ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ప‌క్కా అని టీడీపీ అధినేత చంద్ర‌బాబు అదే ప‌నిగా చెప్ప‌టం తెలిసిందే. పోలింగ్ స‌ర‌ళిని జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించిన వారు.. ఏపీ ప్ర‌జ‌ల మూడ్ ప‌సిగ‌ట్టిన వారంతా బాబు ఓట‌మి ఖాయ‌మ‌న్న మాట‌ను బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెప్పేస్తున్నారు.

ఇదంతా ఉత్త ప్ర‌చార‌మే త‌ప్పించి.. త‌మ విజ‌యం ఖ‌రారైన‌ట్లుగా బాబు స్ప‌ష్టం చేస్తున్నారు. విజ‌యం మీద సందేహాలు అక్క‌ర్లేద‌ని తెలుగు త‌మ్ముళ్లకు చంద్ర‌బాబు చెబుతున్నా.. వాస్త‌వాన్ని ఆయ‌న గ్ర‌హించిన‌ట్లుగా తాజా ఉదంతాన్ని చూస్తే అర్థం కాక మాన‌దు. తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా మూడు రోజుల పాటు కార్య‌క్ర‌మాల్ని నిర్వ‌హిస్తుంటారు.

ఈ నెల 27న జ‌ర‌గాల్సిన మ‌హానాడును నిర్వ‌హించే విష‌యంలో బాబు సానుకూలంగా లేరన్న విష‌యం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. నిన్న (మంగ‌ళ‌వారం) నిర్వ‌హించిన మంత్రివ‌ర్గ స‌మావేశంలో మ‌హానాడుపై చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ఈ నెల 23న ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డనున్న నేప‌థ్యంలో.. త‌క్కువ వ్య‌వ‌ధిలో మ‌హానాడును నిర్వ‌హించ‌టం క‌ష్ట‌మ‌ని బాబు వ్యాఖ్యానించిన‌ట్లుగా తెలుస్తోంది. అందుకే ఈసారి ర‌ద్దు చేస్తున్న‌ట్లుగా స‌మాచారం.

ఎన్నిక‌ల ఫ‌లితాలుసానుకూలంగా వ‌చ్చే న‌మ్మ‌కం ఉంటే.. వేడుక‌గా మ‌హానాడును నిర్వ‌హించే వీలుంది. కానీ.. అలాంటి ప‌రిస్థితి లేక‌పోవ‌టంతో స‌మ‌యం స‌రిపోద‌న్న పేరుతో మ‌హానాడును వాయిదా వేయాల‌ని భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ఓట‌మి ఖాయ‌మ‌ని.. అలాంటి వేళ మహానాడును నిర్వ‌హిస్తే.. ప్లాప్ షో ప‌క్కా అని.. అందుకే ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా ఈ ఏడాది ర‌ద్దు చేయాల‌న్న ఆలోచ‌న‌ను బాబు తెర మీద‌కు తెచ్చిన‌ట్లుగా భావిస్తున్నారు.

బాబు ఓట‌మి తాజా ఉదంతంతో ఖాయ‌మ‌ని తేలిన‌ట్లేన‌ని చెబుతున్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం ఢిల్లీలో చ‌క్రం తిప్పే విష‌యంలో బాబు బిజీగా ఉంటారు కాబ‌ట్టి.. స‌మ‌యాభావంతో ర‌ద్దు చేస్తున్న‌ట్లుగా క‌వ‌రింగ్ మాట‌లు చెబుతున్నారు. అదే నిజ‌మేతే.. పెద్ద బాబు ఢిల్లీలో బిజీగా ఉంటే.. చిన్న బాబు చేతుల మీదుగా మ‌హానాడును నిర్వ‌హించొచ్చు క‌దా?
Tags:    

Similar News