పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు కదా.. దానికి సంబంధించి నూరు శాతం ఖర్చులను కేంద్రం భరించి నిర్మాణం పూర్తి చేస్తాం అని మాట ఇచ్చింది కదా.. మరి తాను చేస్తున్నట్లుగా చంద్రబాబు బిల్డప్ ఇవ్వడమూ - ప్రతి సోమవారం సమీక్షలు చేయడమూ ఏమిటి? అనే సందేహం ఇప్పటిదాకా చాలా మందికి వచ్చింది. అయితే చంద్రబాబునాయుడు.. వారందరికీ ఒకే సమాధానం చెప్పారు. జాతీయ ప్రాజెక్టు కింద కేంద్రం చేపట్టిన ప్రాజెక్టుల పనులు ఎక్కడైనా ఎప్పుడైనా సకాలంలో పూర్తయిన దాఖలాలు ఉన్నాయా? వాళ్లే పనులు చేపడితే ఇది పూర్తి కావడం అసాధ్యం.. అందుకే నేను పనులు చేయిస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు. కాంట్రాక్టర్లతో తాము నేరుగా కుమ్మక్కు కావడానికే చంద్రబాబునాయుడు ఇలాంటి మాయోపాయం పన్నుతున్నారని ప్రజల నుంచి ప్రతిపక్షాలనుంచి చాలా విమర్శలు వచ్చాయి కూడా!
అయితే పోలవరం పనులు మాత్రం వేగిరం సాగింది లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంటున్నాయి. పైగా ఇన్నాళ్లూ చంద్రబాబునాయుడు ఏ ట్రాన్స్ ట్రాయ్ కాంట్రాక్టు సంస్థనైతే నెత్తిన పెట్టుకుని మోశారో... వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నట్లుగా ఆరోపణలు కూడా ఎదుర్కొన్నాడో.. అదే ట్రాన్స్ ట్రాయ్ అసలు పనులంటూ పూర్తి కావడం అసాధ్యం అనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చేసినట్లుగా తాజాగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సంస్థకు నోటీసులు కూడా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
ఒక్కటి మినహా, ఈ సంస్థను పనులనుంచి తప్పించి.. కొత్తగా టెండర్లు పిలిచి పనులు చేపట్టాలనే ఆలోచనతో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలతో కేంద్రం వద్దకు వెళ్లడానికి ప్రభుత్వ అధికార్ల బృందం కూడా సిద్ధం అవుతోంది.
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను లోతుగా గమనిస్తే.. పోలవరం పనుల నిర్వహణ ఇక తన వల్ల కాదంటూ చంద్రబాబునాయుడు చేతులెత్తేసినట్లుగా కనిపిస్తున్నదని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా టెండర్లు పిలవడానికి కేంద్రం అనుమతి కోసం వెళ్లడం అంటే.. ఇక ఆ వ్యవహారం ఒక పట్టాన తెమిలేది కాదని.. పైగా పూర్తిగా కేంద్రం దయాదాక్షిణ్యాలపైన కొత్తగా ఆధారపడాల్సి ఉంటుందని కూడా అంటున్నారు.
కేంద్రం పనులు చేపడితే ఒక పట్టాన పూర్తి కావు.. పనులు కావాలంటే అది నా నిర్వహణలోనే జరగాలి.. అంటూ ఇన్నాళ్లూ చంద్రబాబునాయుడు చెప్పిన మాటలన్నీ గాలికి కొట్టుకుపోయినట్లే. అయితే చంద్రబాబు తాజా ఆలోచన కేంద్రం వద్ద యథాతథంగా వర్కవుట్ కావడం అసాధ్యమే అని అంతా అంటున్నారు. ఎందుకంటే గతంలో ఒకసారి అంచనాలు సవరించినందుకే , ఆ డిఫరెన్స్ అమౌంట్ ను ఇవ్వడానికి కేంద్రం ముప్పతిప్పలు పెడుతోంది. ఇప్పుడు కొత్తగా టెండర్లు పిలవడం అంటే.. ఆ భారం ఎవరు మోయాలనే ప్రశ్న తప్పక వస్తుంది. ఈ నేపథ్యంలో పోలవరం పనుల పూర్తి అనేది ప్రహసనంగా మారిపోతుందని పలువురు భయపడుతున్నారు.