పోల‌వ‌రంపై బాబు కొత్త స్కెచ్

Update: 2017-04-18 06:14 GMT
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు - ఆయ‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రులు చేసే ప్ర‌క‌ట‌నలు ఎంత భిన్నంగా ఒక్కో సంద‌ర్భంలో చిత్రంగా కూడా ఉంటాయో తెలియ‌జెప్పేందుకు ఇదే ఉదాహ‌ర‌ణ‌. పోల‌వ‌రం నిర్మాణాన్ని ఏపీ ప్ర‌భుత్వం టాప్ ప్ర‌యారిటీ కింద తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్టు ప‌ర్యవేక్ష‌ణ కోసం వారంలో ఒకరోజును కూడా ప్ర‌త్యేకంగా సీఎం చంద్ర‌బాబు కేటాయించేశారు. అందుకే అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్‌ ప్రజల చిరకాల కోరిక నెరవేరుస్తామంటూ నిన్నమొన్నటి వరకూ సీఎం చంద్రబాబు - మంత్రులు పదేపదే ప్రకటనలు గుప్పించారు. అయితే తాజాగా మాట మారిపోతుందని అంటున్నారు. వాస్త‌వాల‌ను గ్ర‌హించడమే ఇందుకు కార‌ణ‌మ‌ని చెప్తున్నారు.

ఇప్పటివ‌ర‌కు ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌హా మంత్రులు పోల‌వరం ప్రాజెక్టు గురించి ప్ర‌స్తావించిన‌ప్పుడ‌ల్లా...2018కల్లా గ్రావిటీతో నీళ్లను నిల్వ చేస్తామని, పూర్తిస్థాయి ప్రాజెక్టు నిర్మాణం 2019కు పూర్తవుతుందని చెబుతున్నారు. అయితే క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితులు వేరేగా ఉన్నాయంటున్నారు. 2018కి ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ప‌నుల్లో విప‌రీత‌మైన జాప్యం - నిధుల కొర‌త వంటి అంశాలు ఇందుకు కార‌ణంగా మార‌నుంది. ఈ కార‌ణాల వ‌ల్లే టీడీపీ స‌ర్కారు మాట మార్చ‌వ‌చ్చ‌ని అంటున్నారు 2019లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో సీఎం మాటమార్చి కొత్తపల్లవి అందుకోనున్నట్లు తెలుస్తోంది. గోదావరికి అడ్డంగా డయాఫ్రాంవాల్‌ - స్పిల్‌ వే పనుల నిర్మాణం జరిగితే కొంతమేర నీరు నిల్వ ఉండే అవకాశం ఉంది. ఆ నీటినే గ్రావిటీ నీటిగా చూపించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోసారి టీడీపీని గెలిపిస్తే 2019 చివరికల్లా ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందే ఆలోచనలో ఉన్నట్లుగా చెప్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News