ఏపీ ముఖ్యమంత్రి - టీడీపీ అధినేత నారా చంద్రబాబు తన పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులపై తీవ్ర అసంతృఫ్తి వ్యక్తం చేశారు. విశాఖపట్టణంకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు - కార్యకర్తలతో సమావేశమైన చంద్రబాబు ఈ క్రమంలో తీవ్ర అసహనం - ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. "అధికారం చేపట్టి రెండున్నరేళ్లలో ప్రజలకు ఎంతో చేశాం. హుదూద్ వంటి తుపాను నగరాన్ని అతలాకుతలం చేస్తే సమర్ధవంతంగా పనిచేసి పూర్వస్థితికి తీసుకువచ్చాం. ఇటీవలే సుమారు 30వేల మందికి ఇళ్ల పట్టాలిచ్చాం. ఇప్పటి వరకూ దేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ఒకే సారి అంతమందికి సుమారు రూ.4,500 కోట్ల మేర లబ్ధి చేకూర్చే విధంగా పట్టాల పంపిణీని చేపట్టాం. అయితే నగరంలో టీడీపీ సభ్యత్వ నమోదు మాత్రం ఆశించిన స్థాయిలో జరగలేదు. దీనికి కారణం ఏమిటి. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఎక్కడ తడబడుతున్నాం" అంటూ చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.
త్వరలో జరగనున్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల నాటికి ఇదే పరిస్థితులు కొనసాగితే ఫలితాలు ఎలా ఉంటాయో ఆలోచించుకోండంటూ తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు హితబోధ చేశారు. పట్టాలు ఇచ్చాం కదా, ఇక మనకే ఓట్లేస్తారనుకుంటే పొరపాటేనని - పార్టీ పరంగా తాము మీకు అండగా ఉంటామన్న భరోసా ప్రజలకు కల్పించాలని సూచించారు. నగరంలో ఎమ్మెల్యే పనితీరును చంద్రబాబు ప్రస్తావిస్తూ ఒకరిద్దరు మాత్రమే ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ - పట్టు సాధిస్తున్నారని - మిగిలిన వారు మాత్రం పార్టీ- ప్రభుత్వం చూసుకుంటుందన్న ధోరణిలో ఉన్నారని హెచ్చరించారు. ఏపీతో పోలిస్తే వెనుకబడిన ఒడిశా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల అమలు అంతంతమాత్రమే అయినప్పటికీ నవీన్ పట్నాయక్ సాధిస్తున్న విజయాలను చంద్రబాబు ప్రస్తావించారు. పార్టీని ప్రజలకు చేరువ చేయడం ద్వారానే ఒడిశాలో వరుస గెలుపు సాధ్యమైందని గుర్తు చేశారు. ఇప్పటికైనా పార్టీ వర్గాలు ప్రజలతో మమేకం కావాలని చంద్రబాబు హితవు పలికారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/