స్పెషల్‌ క్లాస్‌:జగన్‌ ను మీరు సరిగా తిట్టడం లేదు

Update: 2016-08-20 15:58 GMT
ఆంధ్రప్రదేశ్‌ కాబినెట్‌ సమావేశం శుక్రవారం జరిగింది. సాధారణంగా కేబినెట్‌ సమావేశం వంటివి జరిగినప్పుడు, ఎజెండాతో నిమిత్తం లేని అనేక అంశాల మీద కూడా మంత్రుల మద్య చర్చోపచర్చలు సహజంగానే జరుగుతాయి. అదేవిధంగా.. శనివారం నాటి కేబినెట్‌ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకించి కొందరు మంత్రుల వద్ద తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా అమరావతిలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

కృష్ణా పుష్కరాల నిర్వహణలో దొర్లిన కొన్ని వైఫల్యాల గురించి - వాటితో పాటూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం సాగించడంలో చంద్రబాబు ప్రదర్శిస్తున్న రెండు నాలుకల ధోరణి గురించి ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి నిశిత విమర్శలు గుప్పించిన సంగతి అందరికీ తెలిసిందే. జనాన్ని ఆలోచింజేసేలా జగన్‌ విమర్శలు సాగాయి.

అయితే సహజంగానే జగన్‌ విమర్శలను తెదేపా నాయకులు సహించలేకపోయారు. చినరాజప్ప లాంటి మంత్రులు - గాలి ముద్దుకృష్ణమ నాయుడు లాంటి నాయకులు విడివిడిగా ఎక్కడికక్కడ ప్రెస్‌ మీట్‌ లు పెట్టి జగన్‌ ను ఉతికి ఆరేశారు. అయితే జగన్‌ ను తిట్టిపోయడంలో.. కొందరు మంత్రులు మాత్రమే బాగా స్పందిస్తున్నారని, కొందరు మంత్రులు జగన్‌ ను తిట్టడానికి అంతగా చురుగ్గా ముందుకు రావడం లేదని చంద్రబాబునాయుడు చింతిస్తున్నారుట. తెదేపా మంత్రులందరూ కూడా.. విడివిడిగా ఎక్కడికక్కడ ప్రెస్‌ మీట్‌ లు పెట్టి జగన్‌ ను తిట్టి ఉంటే గనుక.. ఆయన ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఉండేవాడని చంద్రబాబు భావిస్తున్నారట. జగన్‌ మీద అడ్డగోలు విమర్శలు గుప్పించడంలో వెనుకబడుతున్న కొందరు మంత్రులకు ఆయన ప్రత్యేకంగా క్లాస్‌ తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది.

పాపం చంద్రబాబునాయుడు.. తన పనితీరును శుద్ధంగా మెరుగుపరుచుకోలేకుండా, లోపాలను ఎత్తిచూపిస్తున్న వారి మీద ఎదురు దాడులకు మంత్రివర్గ సహచరులను బతిమాలే పరిస్థితి వచ్చిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News