చంద్రబాబు అనేక సార్లు ... తాను నిప్పు అని చెప్పుకోవడం మనం చూసే ఉంటాం. జీవితంలో తప్పు చేయలేదు అని అనడమూ విన్నాం. అతను నిజాయితీ పరుడే. కాకపోతే ఆయన సొంత డిక్షనరీలో నిజాయితీపరుడు అనే పదానికి వేరే అర్థం రాసుకున్నాడేమో. ఏమిటీ గోల అంటున్నారా... గోల కాదండీ చంద్రబాబు నీతి కథ.
రాజ్యాంగం ప్రకారం ఒక ఎమ్మెల్యే పార్టీ ఫిరాయిస్తే అతని సభ్యత్వం రద్దు చేసే హక్కు స్పీకర్ కు ఉంటుంది. అయితే, అది స్పీకర్ విచక్షణ మేరకు పనిచేస్తుంది. ఏపీలో టీడీపీ గెలిచిన ఎమ్మెల్యేలతోనే ప్రభుత్వం ఏర్పాటైంది. అయినా రాజ్యాంగ ఉల్లంఘన చేశారు చంద్రబాబు. ఫిరాయింపుదారులను ప్రోత్సహించారు. 23 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు. అతను నిప్పు అయితే... వారి చేత రాజీనామాలు చేయించి పార్టీలో చేర్చుకోవాలి. ఎన్నికలకు వెళ్లి ఆ సీట్లు గెలవాలి. కానీ ఇతరులకు నీతులు చెప్పే చంద్రబాబు తాను మాత్రం పాటించడు. స్పీకర్ విచక్షణ అనే పాయింట్ ఆధారంగా వైసీపీ జెండాపై గెలిచిన ఎమ్మెల్యేలను కొనసాగించడమే కాకుండా వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా ఇవ్వడంతో పలువురు విస్మయం చెందారు. పోనీ అక్కడితో వదిలేశారా అంటే లేదు. తెలంగాణలో ఆయన - ఆయన బావమరిది బాలకృష్ణ ఈరోజు ఫిరాయింపులపై చెలరేగిపోయారు. అంటే చంద్రబాబుది తెలంగాణకు ఒక నీతి - ఆంధ్రాకు ఒక నీతి.
ఆంధ్రప్రదేశ్ లో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకుని అభివృద్ధి చూసి వచ్చారన్న చంద్రబాబు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పార్టీ వీడిన ఎమ్మెల్యేలను ఓడించాలని ఓటర్లకు పిలుపునివ్వడం విడ్డూరాలకే విడ్డూరం. మరి ఈ మాట అనేటపుడు ఏపీలో జనం కూడా దీనిని పాటించాలా వద్దా అన్నది చంద్రబాబు చెప్పాలి. నిప్పు నిజాయితీ అని చెప్పుకుంటే సరిపోదు. దానిని ఫాలో అవ్వాలి.
చంద్రబాబు బావమరిది కూడా తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బావ బావమరిది దొందూ దొందే. ఇతరులకు ఓ నీతి - తమదో నీతి.