ఎన్నికల వేళ.. ఓటర్ల మీద రాజకీయ నేతలు కురిపించే ప్రేమ అంతా ఇంతా కాదు. అదే అధికారంలో ఉంటే.. ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ ప్రయారిటీ ఎంత ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని చేతల్లో చూపిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. భూమానాగిరెడ్డి అకాల మరణం నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో నంద్యాల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది.
తాజాగా ఆ వాదనను నిజం చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా నంద్యాల మీద వరాల వర్షం కురిపిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో నంద్యాల ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్న వేళ.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే ముందే.. నంద్యాల నియోజకవర్గం మీద వరాల వర్షం కురిపిస్తోంది బాబు సర్కారు.
నంద్యాల నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న శిల్పా మోహన్ రెడ్డి ఇటీవల విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన నేపథ్యంలో .. పోటీ తీవ్రంగా మారింది. దీంతో నంద్యాల ఉప ఎన్నిక మీద బాబు ఫోకస్ మరింత పెరిగింది. ఇప్పటికే నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ చేసేందుకు కొందరు మంత్రులకు బాధ్యతలు అప్పజెప్పిన ఆయన.. డైలీ బేసిస్ లో నంద్యాలకు సంబంధించి అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు చెబుతున్నారు.
తాజాగా నంద్యాల పట్టణంలోని కాపు కల్యాణ మండపానికి రూ.3 కోట్లు మంజూరు చేస్తూ మంగళవారం రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఎప్పటినుంచో కాపు కల్యాణ మండంపై స్థానిక కాపు వర్గం నుంచి డిమాండ్ ఉన్నప్పటికీ పెద్దగా పట్టించుకోని సర్కారు.. తాజాగా మాత్రం ఉత్తర్వులు జారీ చేయటం గమనార్హం. కాపు వర్గం ఓట్లను ఆకర్షించేందుకు వీలుగా కల్యాణ మండపానికి నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు చెబుతున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని వర్గాలకు ఇదే రీతిలో తాయిలాలు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.