ఎలాగైన గెలవాలి .... ఏం చేసైన నిలవాలి... ఇందుకు ఎవరినైన పణంగా పెట్టాలి. ఈ రాజకీయ క్రీడలలో గెలుపోటములే తప్పా - నైతికత పాటించకూడదు. ఇదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీరు. మూడున్నర దశాబ్దాల పాటు రాష్ట్ర - జాతీయ రాజకీయాలలో ఉన్న చంద్రబాబు నాయుడు వేసే ప్రతి అడుగు రాజకీయామే. తీసుకునే ప్రతి నిర్ణయమూ అధికారం కోసమే. ఒక్క మాజీ ముఖ్యమంత్రి - దివంగత నేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి హాయాంలోనే చంద్రబాబు ఎత్తులు పారలేదు. 2014 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీతో పొత్తు - పవన్ కళ్యాణ్ ను వినియోగించుకున్న తీరు చంద్రబాబు నాయుడు రాజకీయాలకు పరకాష్ట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నానాటికి బలపడుతున్న ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ మోహన రెడ్డిని ఎదుర్కునేందుకు చంద్రబాబు నాయుడు కోవర్టు ఆపరేషన్ కు తెర తీసారు.
తెలుగుదేశం పార్టీలో తనపై అసంత్రుప్తితో ఉన్నవారిలో కొందరిని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్పించారు. అలాంటి వారిలో విశాఖపట్నం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మేల్యే కన్నబాబు రాజు ఒకరు. ఎలమంచిలి నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మేల్యేగా ఎన్నికైన కన్నబాబు రాజు తెలుగుదేశం పార్టీపై ఆగ్రహంతో ఉన్నారు. తనకు ఎలాంటి పదవులు ఇవ్వలేదని బహిరంగగానే విమర్శించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరారు. విశాఖ జిల్లా పర్యటనకు జగన్ వస్తున్నారని తెలిసి కూడా ఆయన జిల్లాలో లేరు. పదిరోజులుగా అజ్నాతంలో ఉన్నారు. చివరకు తన సెల్ ఫోను కూడా స్వచ్ ఆఫ్ చేసారు. హఠత్తుగా తెరపైకి వచ్చి గతంలో జగన్ కు తాను భారిగా డబ్బులిచ్చినట్టు ప్రకటించారు. ఈ హఠత్ ప్రకటన వెనుక చంద్రబాబు నాయుడున్నారని జిల్లాలో ప్రచారం అవుతోంది. ఇటీవల వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన నాయకులలో కొందరు తెలుగుదేశం పార్టీకి కోవర్టులుగా పనిచేస్తున్నారనే అనుమానాలు వస్తున్నాయి. గతంలో కూడా చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రత్యర్దులను ఢీ కొట్టేందుకు ఇలా కోవర్టు రాజకీయాలు నెరపిన అనుభవం ఉంది. తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ లోకి అనేక మందిని పంపి కోవర్టులుగా పనిచేయించారు. ఇప్పుడు అదే రాజకీయాలు చేస్తున్నారు. అందులో భాగంగానే కన్నబాబు రాజుతో జగన్ పై ఆరోపణల చేయిస్తున్నారని అంటున్నారు. ఇంతవరకూ పార్టీలో చేరిన వారెవ్వరూ జగన్ కి డోనేషన్లు ఇచ్చామని ప్రకటించలేదు. గతంలో జే.సీ. దివాకర్ రెడ్డి మాత్రమే తనను డబ్బులు అడిగారని చెప్పారు. ఈ తార్కాణాలతో వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో కోవర్టులు ఎక్కువైనట్లు తెలుస్తోంది. జగన్ లో డబ్బు యావ ఉంటే - డబ్బులిచ్చి చేర్చుకుంటే మాజీ మంత్రి డి.ఎల్. రవీంద్ర రెడ్డి వంటి సీనియర్ నాయకులు వస్తారా.. అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.