తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సభా వేదికగా చేసిన కామెంట్ ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. సభా వేదికగా తన తనయుడైన మంత్రి లోకేష్ వ్యాఖ్యలతో విబేధించడమే కాకుండా...చిన్న పాటి క్లాస్ కూడా తీసుకున్నారు. అయితే అది క్లాస్ కం కౌంటర్ లాగా అనిపిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే...ఏపీటా సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడైన మంత్రి లోకేష్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన కుమారుడు, మంత్రి నారా లోకేషే కామెంట్లపై సీఎం చంద్రబాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన యువత ఐటీ రంగంలో ఉద్యోగాల విషయంలో ఆలోచన దోరణి మార్చుకోవాలన్నారు. ఉద్యోగాలు వస్తే బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో పనిచేసేందుకు సిద్ధపడుతున్నారని వివరించారు. తద్వారా విశాఖపట్నంలో పనిచేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని మంత్రి లోకేష్ అన్నారు. అందుకే రాష్ట్రంలోని యువత ఐటీ రంగంలో ఉద్యోగాల విషయంలో ఇతర రాష్ట్రాలకు పోవడం కాకుండా, మన దగ్గరే పని చేసుకోవడానికి ఆసక్తి చూపించాలని లోకేష్ కోరారు. తద్వారా ఐటీ పరిశ్రమ వృద్ధి చెందుతుందని, ఇక్కడ పెట్టుబడులు పెట్టే కంపెనీలకు సైతం నిపుణులైన మానవ వనరులు దొరుకుతాయని వివరించారు.
అయితే మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు సభా వేదికగానే విబేధించారు. ``ఒక అడుగు ముందుకేస్తే... అదే వంద అడుగులు వేయడానికి నాంది అవుతుంది. తాజాగా ఐటీ మినిస్టర్ ఓ మాట అన్నాడు. ఆయనకు, నాకు ఒక డిఫరెన్స్ ఉందిక్కడ. ఆయనేమన్నాడంటే... మీరంతా వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. మీరంతా ఇక్కడికి రావాలన్నాడు. నా ఆలోచన ఏమిటంటే - మీరు ప్రపంచమంతా వెళ్లాలి...ఎక్కడ చూసినా తెలుగు వాళ్లే ఉండాలి. ప్రపంచాన్ని జయించే పరిస్థితిలో ఉండాల్సిన అవసరం ఉంది`` అని చంద్రబాబు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు విస్తరించిన సమయంలో తెలుగువారి ఆలోచన తీరును కూడా ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వివరించారు. సేవ చేయాలనే దృష్టితో మన ఎదుగుదల ఉండాలని అన్నారు. తాను ఏ దేశానికి వెళ్లినా, అక్కడ తెలుగువారు ఎక్కువగా ఉంటున్నారని, వారిని చూసినప్పుడల్లా సంతోషంగా ఉందని....మన వాళ్లతో ఏకంగా ఓ సభ పెట్టవచ్చునని అనిపిస్తుందన్నారు.
ఈ సందర్భంగా తను పెట్టుకున్న లక్ష్యాలను సీఎం చంద్రబాబు వివరించారు. రాబోయే రోజుల్లో నాలెడ్జ్ ఎకానమీ ఆధారంగా అభివృద్ధిని చేస్తామని తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం వచ్చే 2029 నాటికీ దేశంలోనే అగ్రగామిగా అవతరిస్తుందని సీఎం చంద్రబాబు అశాభావం వ్యక్తం చేసారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ను ప్రారంభించిన తరువాత పాలనలో పారదర్శకత పెరిగిందని చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు.