ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు - తెలంగాణ సీఎం కేసీఆర్ లు ఒకప్పుడు ఒకే పార్టీనుంచి వచ్చిన వారనే విషయం తెలిసిందే. కాంగ్రెస్ నాయకులుగా ప్రారంభం అయిన ఈ ఇద్దరు నాయకుల ప్రస్థానం తర్వాత తెలుగుదేశం నీడకు చేరి సన్నిహితులుగా మారారు. తర్వాత ఈ ఇద్దరు నాయకులు తమ భావాలకు అనుగుణంగా ముందుకు సాగడం. కట్ చేస్తే...వేర్వేరు రాష్ర్టాలకు సీఎంలుగా పాలనా పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే.
పేరుకు ఎవరి రాష్ర్టానికి వారు సీఎం అయినప్పటికీ ఇద్దరికీ అనేక అంశాల్లో గ్యాప్ ఉంది. ఓటుకునోటు అంశం ఈ దూరాన్ని మరింత పెంచింది. అయితే తాజాగా ఇద్దరు సీఎంల మధ్య సానుకూల వాతావరణం ఏర్పడుతున్న క్రమంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీకి చెందిన మాజీ ఎంపీ, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి కుమారుడి వివాహానికి విజయవాడ నుంచి ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు హైదరాబాద్ వచ్చారు. వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
అనంతరం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు అయిన మైహోమ్స్ సంస్థల అధినేత జూపల్లి రామేశ్వరరావుతో చంద్రబాబు భేటీ అయ్యారు. రావుల కుమారుడి వివాహానికి హాజరయిన అనంతరం అక్కడే ఉన్న రామేశ్వరరావుతో చంద్రబాబు ముచ్చటించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆప్తుడు అయిన రామేశ్వరరావుతో ఏం మాట్లాడారనేది ఆసక్తికరంగా ఉంది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో హైటెక్ సిటీని తీర్చిదిద్దుతున్నపుడు జూపల్లి కూడా అందులో భాగస్వామ్యం అయ్యారు. వ్యాపార విస్తరణతో పాటు హైటెక్ సిటీకి ప్రాచుర్యం కల్పించడంలో రామేశ్వరరావు ఒకరయినందున..ప్రస్తుతం వివాహ సమయంలో ఈ మాటామంతీ జరిగిందని సమాచారం. ఇంతేకాకుండా కేసీఆర్ తో పాటు చంద్రబాబు కూడా అత్యంత గౌరవించే త్రిదండి చిన్నజీయర్ స్వామి మైహోం రామేశ్వరరావుకు గురువు అనే సంగతి తెలిసిందే.