చంద్రబాబు లెక్కవేరు.. తెలంగాణలో చేవచచ్చి.. చేతగానిదిగా తయారైన టీడీపీని ఆయన లేపాలనుకోవడం లేదు. ముందుకు సాగాలని కోరుకోవడం లేదు. అందుకే బలమైన కాంగ్రెస్ పంచన చేరి ఆ పార్టీ బలంతో అన్నో ఇన్నో సీట్లు సాధించాలని ఉబలాపడుతున్నారు. తెలంగాణలో గెలిచినా.. ఓడినా బాబుకు వచ్చే నష్టమేమీ లేదు. అందుకే టీడీపీ అధినేత కాంగ్రెస్ ఎన్ని సీట్లు ఇచ్చినా చచ్చినట్టు కళ్లు మూసుకొని మహాకూటమి గెలుపునకు కృషి చేయాలని.. అవసరమైతే త్యాగాలు చేయాలని టీడీపీ నేతలకు హితబోధ చేశారు.
ఇప్పుడు టీడీపీ అధినేత త్యాగశీలత కూటమిలోని టీజేఎస్ - సీపీఐ పుట్టి ముంచుతోంది. ఆయన అవకాశవాద భవిష్యత్ రాజకీయ వ్యూహంలో ఇవి సమిధలుగా మిగిలిపోతున్నాయి. చంద్రబాబు పార్టీ గడిచిన ఎన్నికల్లో 15 సీట్లలో గెలిచింది. పొత్తులో భాగంగా బీజేపీని 5 సీట్లలో గెలిపించేసింది. అంటే మొత్తం 20 సీట్లలో టీడీపీ బలం బలగం ఉన్నట్టు. ఈ లెక్కన కనీసం 25సీట్లు అయినా టీడీపీకి కాంగ్రెస్ ఇవ్వాలి. పోనీ గెలిచే 20 సీట్లు అయినా కేటాయించాలి. కానీ కాంగ్రెస్ మాత్రం 12 మాత్రమే ఇస్తానంటోందట.. కాంగ్రెస్ నిర్ణయానికి కట్టుబడి గెలిచాక నామినేట్ పదవులు తీసుకోవాలని.. కాంగ్రెస్ గెలిచే సీట్లను అడగవద్దని టీడీపీ అధినేత పార్టీ నేతలకు చెప్పడం టీడీపీ సీనియర్లు - ఆశావహుల్లో నెత్తురు చుక్క లేకుండా చేసింది. తెలంగాణ తెలుగు దేశ నేతల భవిష్యత్ ను అంధకారం చేసింది. అధికార యోగం కోసం పాకులాడడం టీడీపీలో సాధ్యం కాదని వాళ్లు బలంగా నమ్ముతున్నారు.
కాంగ్రెస్ ను డిమాండ్ చేయవద్దని.. వాళ్లు అడిగినంత తీసుకోవాలని బాబు అన్న మాట కూటమిలో అసమ్మతికి తెరతీసింది. టీజీఎస్ - సీపీఐలు టీడీపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. తమకు బేరమాడే అవకాశాన్ని తీసేసిన తెలుగుదేశం పార్టీ అధినేతపై గుర్రుగా ఉన్నాయట..
టీడీపీయే 12 సీట్లు అడగడంతో అంతకంటే తక్కువ బలమున్న సీపీఐ - టీజేఎస్ లు ఇంకా తక్కువ సీట్లు పొందే అవకాశాలున్నాయి. సీపీఐ 19 సీట్లు అడుగుతుండగా.. కాంగ్రెస్ 3 మాత్రమే ఇస్తానంటోంది. టీజేఎస్ కోదండరాం 36 అడిగితే.. 12 మాత్రమే కాంగ్రెస్ ఇస్తానంటోందట.. కూటమిలోని భాగస్వామ్య పార్టీలు సీట్లు పొందలేకపోవడానికి చంద్రబాబే కారణమని టీజేఎస్ - సీపీఐ తిరుగుబావుటాకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఇదంతా చంద్రబాబు పుణ్యమే మరి...