బాబు దెబ్బ‌కు బ‌ల‌వుతున్న టాలీవుడ్ డైరెక్ట‌ర్లు!

Update: 2019-07-24 08:53 GMT
ఏపీ మాజీ సీఎం - టీడీపీ అధినేత చంద్ర‌బాబు సాగించిన వ్య‌వ‌హారంలో ఇప్పుడు టాలీవుడ్‌ లోని ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ల‌కు కూడా రాజ‌కీయ మ‌కిలి అంటుకుంటోందా ? ప‌్ర‌స్తుతం ఏపీలో ప‌గ్గాలు చేప‌ట్టిన వైసీపీ ప్ర‌భుత్వం బాబు నిర్వాకాల‌ను వెలికి తీసే చ‌ర్య‌ల‌కు పూనుకోవ‌డంతో ఇప్పుడు నాటి వ్య‌వ‌హారినికి సంబంధించి ఒక‌రిద్ద‌రు ద‌ర్శ‌కులు వివాదాల్లో చిక్కుకుంటు న్నారు. ఇలా వివాదానికి కార‌కులుగా మారుతున్న డైరెక్ట‌ర్లు ఇద్ద‌రూ కూడా టాలీవుడ్‌లో భారీ రేంజ్‌ లో ఉన్న అగ్ర ద‌ర్శ‌కులే కావ‌డం గ‌మ‌నార్హం. బాబు త‌న ప్ర‌చారానికి - ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌చారం చేసుకునేందుకు ఓ ఇద్ద‌రు ద‌ర్శ‌కుల‌ను అడ్డు పెట్టుకున్నారు.

వారే బాహుబ‌లితో ప్రపంచ రికార్డులు సృష్టించిన రాజ‌మౌళి. మ‌రొక‌రు తెలుగు వెండితెర‌పై స‌న్సేష‌న్లు సృష్టించిన బోయపాటి శ్రీనివాస్‌. ఈ ఇద్ద‌రూ కూడా నిజానికి రాజ‌కీయాల‌కు అతీతంగా త‌మ ప‌నులు తాము చేసుకుంటూ.. పేరు తెచ్చుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప‌క్క రాష్ట్రాల్లోను - దేశంలోను రాజ‌మౌళికి మంచి పేరు ఉంది. అయితే, త‌న పాల‌న‌కు ప్ర‌చారార్భాటాన్ని కోరుకున్న చంద్ర‌బాబు ఈ ఇద్ద‌రినీ అడ్డు పెట్టుకుని కొన్ని కార్య‌క్ర‌మాల‌కు తెర‌దీశారు.

ముఖ్యంగా పుష్క‌రాలు - న‌దుల సంగ‌మం విష‌యాల్లో బోయ‌పాటి ని బాగా వాడేసుకున్నారు. గోదావ‌రి - కృష్ణా పుష్క‌రాల‌ను పెద్ద పండ‌గ‌లా చేసిన చంద్ర‌బాబు.. మొత్తం బోయ‌పాటి డైరెక్ష‌న్‌ లోనే వీటిని నిర్వ‌హించారు. ఇక‌,రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి సింగ‌పూర్‌ - జ‌పాన్ వంటి దేశాల ఆర్కిటెక్టుల‌ను కూడా సంప్ర‌దించిన చంద్ర‌బాబు చివ‌ర‌కు బాహుబ‌లి హిట్ కావ‌డంతో ఆ సినిమా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిని సంప్ర‌దించి అమ‌రావ‌తి డిజైన్లు ఇవ్వాల‌ని నేరుగా అప్ప‌టి మంత్రి నారాయ‌ణ‌ను రాజ‌మౌళి ద‌గ్గ‌ర‌కు పంపి మ‌రీ కోరారు.

అయితే, ఆయ‌న ఏం చెప్పారో.. బాబు ఏమ‌డిగారో .. ఇప్ప‌టికీ మిస్ట‌రీనే. అయితే, ఈ ఇద్ద‌రు మాత్రం ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో సెంట‌రాఫ్‌ ది టాక్‌ గా మారారు. ఇటీవ‌ల అమ‌రావ‌తి ప్ర‌స్థావ‌న వ‌చ్చిన‌ప్పుడు రాజ‌మౌళిని, ఇప్పుడు తాజాగా గోదావ‌రి పుష్క‌రాల మృతుల ఘ‌ట‌న చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ప్ప‌డు బోయ‌పాటిని అధికార పార్టీ వైసీపీ టార్గెట్ చేసింది. ఇలా బాబు త‌న పాల‌న‌లో తాను చెడింది కాక‌.. రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న వీరిని కూడా రాజ‌కీయ రొంపిలోగి లాగి ఈ రొచ్చు అంటించార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజ‌మే క‌దా.. !!


Tags:    

Similar News