కాలం ఎంత సిత్రమైంది. దుష్ట.. దుర్మార్గ కాంగ్రెస్ ను నామరూపాల్లేకుండా చేస్తామని.. కాంగ్రెస్ పార్టీని తరిమి తరిమి కొడతామంటూ అదే పనిగా ఆవేశపడిన చంద్రబాబు.. ఈ రోజున రాష్ట్రం కాని రాష్ట్రానికి వెళ్లి మరీ.. కాంగ్రెస్ కు ఓట్లు వేయాలని ప్రజల్ని అడుగుతున్న తీరును చూస్తే.. ఎలాంటోడు ఎలా అయిపోయాడన్న భావన కలగటం ఖాయం.
తాను కత్తి కట్టిన మోడీని ఓడించి తీరటమే ఇప్పుడు బాబు ముందున్న పెద్ద లక్ష్యం. అదేమిటో కానీ.. బాబుకు కాలం కలిసి రావట్లేదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. రాష్ట్రంలో జగన్ తోనూ.. కేంద్రంలో మోడీతోనూ పెట్టుకున్న బాబుకు.. ఎంత ట్రై చేసినా..సానుకూల ఫలితాలు పెద్దగా రావన్న మాట వినిపిస్తోంది. తనకున్న ఇమేజ్ ఎంతన్న విషయాన్ని బాబు పట్టించుకోకుండా.. తనకు సాయంగా నిలిచే పక్షాలకు అదే పనిగా ప్రచారం చేసే అలవాటు బాబుకు ఉందనుకుంటే తప్పులో కాలేసినట్లే.
ఎందుకంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో ఏమీ చేయలేని పరిస్థితి. రివ్యూలు.. మీటింగ్ లు అని చెప్పి హడావుడి చేస్తున్న వేళ.. ఎన్నికలయ్యాక ఇప్పుడిలా చేయటం అర్థం ఉందా?అన‌్న విమర్శలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఇక..పార్టీలో చేసేది ఏమీ లేని పరిస్థితి. అందరూ ఫలితాల మీద ఉత్కంటతో ఎదురుచూస్తున్నారే తప్పించి.. మిగిలిన విషయాలేమీ పట్టని పరిస్థితుల్లో ఉన్నారు.
ఇలాంటివేళ.. అయితే ఇంట్లో ఉండటం.. లేదంటే ఎన్నికల జరుగుతున్న పక్క రాష్ట్రాలకు వెళ్లి ప్రచారం చేయటం. ఏదో ఒక పని పెట్టుకోవటం.. అయితే మోడీనో.. కాకుంటే జగన్ లో తిట్టకుండా ఒక్కరోజు కూడా ఉండలేని పరిస్థితి. అందుకే ఇప్పుడాయన కర్ణాటకలో ప్రచారం చేస్తున్నారు. కన్నడ గడ్డ మీదకు వెళ్లిన ఆయన మోడీ మీద ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యం బతకాలంటే బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాలంటూ పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కు ఓటేయాలని.. రాహుల్ ను ప్రధానమంత్రిని చేయాలని ఆయన కోరుతున్నారు.
బాబు పడుతున్న శ్రమను చూసినోళ్లు.. సొంత పార్టీ వాళ్లు కూడా ఇంత శ్రమించరేమో? అన్న ప్రశ్న తలెత్తక మానదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బాబు పడుతున్న తపన ఫిఫ్టీ పర్సంట్ పడరేమో అన్న చమత్కారపు మాట పలువరి నోట వస్తోంది.