అంతర్జాతీయంగా చంద్రబాబుకు పెద్ద కష్టమే వచ్చిపడింది! ఆయన ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి - పాదయాత్రలు చేసి - మోడీని సైతం ఏపీకి రప్పించి - వరాల మీద వరాలు గుప్పించి - ఎన్నె టెన్షన్ లను తట్టుకుని సాధించిన ముఖ్యమంత్రి పీఠం ఇప్పుడు మాజీ అయింది!! ప్రపంచంలో భారతీయేతరులను ఎవరినైనా ఇప్పడు చంద్రబాబు గురించి చెప్పండంటే ఠక్కున మాజీ సీఎం అని బదులిచ్చేస్తారు. ఎందుకంటే.. ప్రపంచంలోనే ప్రముఖ ప్రొఫెషనల్ సోషల్ నెట్ వర్కింగ్ సర్వీసైన లింక్డిన్ లో చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి అని వుంది. అది కూడా తెలుగుదేశం పార్టీకి మాజీ ముఖ్యమంత్రి అని కనిపిస్తోంది.
లింక్డిన్ లో అప్ చేసిన డేటా ప్రకారం మొత్తానికి బాబు ఆంధ్రప్రదేశ్ కు చీఫ్ మినిస్టర్ కాదన్న మాట. కేవలం తెలుగుదేశం పార్టీకే ముఖ్యమంత్రి అన్న మాట. అది కూడా మాజీ!! మరి.. ఐటీలో హైదరాబాద్ ను మేటిగా నిలబెట్టింది నేనే. ప్రపంచానికే కంప్యూటర్ పాఠాలు నేర్పింది నేనే. ఓవరాల్ గా నేనో సూపర్ కంప్యూటర్ ను అని ఎప్పటికప్పుడు చెప్పుకునే చంద్రబాబు.. తన లింక్డిన్ ను మాత్రం ఎందుకు అప్‌డేట్ చేసుకోలేకపోవడం ఆశ్చర్యకరమైన విషయం.
తెలుగు రాష్ర్టాలకు చంద్రబాబు ఐటీ పితామహుడిగా గుర్తింపు పొందారు. ఇక టీడీపీ నాయకులు - టోటల్ టీడీపీ గురించిన సమాచారం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు జోరుగా అప్ డేట్ అవుతుంటుంది. మరి అలాంటి చంద్రబాబు సీఎంగా ఎన్నికై రెండున్నరేళ్లు అవుతున్నా ఇంకా ఆయన లింక్డిన్ అక్కౌంట్ లో ఆయన తెలుగుదేశం పార్టీకి మాజీ ముఖ్యమంత్రి అని ఉండడం ఆశ్చర్యకరమైన విషయమే.