పక్కింటమ్మాయికి పెళ్లి చూపులైతే కంగారు పడే కుర్రాడిలా ఉంది ఏపీ సీఎం చంద్రబాబు పరిస్థితి. మిత్రపక్షం బీజేపీ అధ్యక్ష పదవి విషయంలో చంద్రబాబు చాలా టెన్షన్ పడుతున్నారని సమాచారం. ఇప్పటికే ఏపీ బీజేపీలో ఒక వర్గం చంద్రబాబును టార్గెట్ చేసి కొన్నాళ్లపాటు కంటి మీద కునుకు లేకుండా చేసిన సంగతి తెలిసిందే. పరిస్థితులు అనుకూలించకపోవడంతో వారు ఇప్పుడు కామ్ అయినా మళ్లీ టైం వస్తే తనపై దాడికి దిగుతారని చంద్రబాబుకూ తెలుసు. అందుకే ఆ వర్గానికి ఏపీ బీజేపీ పగ్గాలు రాకూడదని చంద్రబాబు కోరుకుంటున్నారు. నిన్నమొన్నటి వరకు ఏపీ బీజేపీలోని చంద్రబాబు వ్యతిరేకులతో ఆ పగ్గాలు అందే సూచనలు కనిపించినా ఇప్పుడు సీను మారింది. చంద్రబాబు అనుకూలురకే బీజేపీ పగ్గాలు చిక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే... చంద్రబాబు మనసులో ఏ మూలో ఇంకా అనుమానం ఉంది. ఒకవేళ తన వైరి వర్గం కానీ పగ్గాలు చేపడితే భవిష్యత్తులో తనకు ఇబ్బందేనని భావిస్తున్న ఆయన ఎలాగైనా సరే బీజేపీ అధిష్ఠానాన్ని ఒప్పించి తన మనుషులకు నాయకత్వం వచ్చేలా చేసుకోవాలని భావిస్తున్నారు.
ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కంభంపాటి హరిబాబు పదవీకాలం త్వరలో ముగియనుంది. ఆయన స్థానంలో కొత్తగా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంలో బీజేపీలో ఎంత ఆసక్తి ఉందో చంద్రబాబుకు అంతకుమించి ఆసక్తి ఉంది. చంద్రబాబును, టీడీపీని చెడామడా తిట్టే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజును ఏపీ బీజేపీ చీఫ్ చేస్తారనే ఊహాగానాలు రావడంతో చంద్రబాబు ఆ ప్రమాదాన్ని ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతమున్న హరిబాబునే కొనసాగించాలంటూ ఇప్పటికే ఆయన బీజేపీ అధిష్ఠానాన్ని వెంకయ్యనాయుడు ద్వారా ప్రభావితం చేస్తున్నట్లుగా సమాచారం.
కాపు సామాజికవర్గాన్ని చేరదీయాలనే లక్ష్యంతో బీజేపీ వీర్రాజు వైపు మొగ్గు చూపే ప్రమాదముందని గుర్తించిన చంద్రబాబు.. ఆ పరిస్థితే వస్తే నేరుగా అమిత్ షా, మోడీలతోనే మాట్లాడి వీర్రాజుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పదవి రాకుండా చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు కేంద్ర మాజీమంత్రి పురంధేశ్వరి కూడా బీజేపీ చీఫ్ పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె వచ్చినా తనకు ఇబ్బందే కాబట్టి చంద్రబాబు ఆ ఇద్దరినీ వ్యతిరేకిస్తున్నారు. ఆ ఇద్దరిలో ఎవరికి పదవి ఇచ్చినా టీడీపీ, బీజేపీల స్నేహానికి ముప్పు తప్పదని ఆ పార్టీ అధిష్ఠానానికి నేరుగా చెప్పాలనే చంద్రబాబు అనుకుంటున్నారట. మరి చంద్రబాబుకు నచ్చినట్లు బీజేపీ చేస్తుందో లేదో చూడాలి. పక్క పార్టీ వ్యవహారాల్లోనూ వేలు పెడుతున్న చంద్రబాబు చూడబోతే బీజేపీ అధ్యక్ష పదవీ తనకే ఇవ్వాలని అడిగేటట్లుగా ఉన్నారు.