ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందని సామెత. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో కొందరి మంత్రుల పరిస్థితి అలాగే ఉంది. ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు - సూచనప్రాయంగానే అయినా త్వరలో రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ - పునర్వ్యవస్థీకరణ ఉంటుందని ప్రకటించారు. అదే సమయంలో చిన బాబు లోకేష్ ను మంత్రి వర్గంలోకి తీసుకుంటున్న విషయాన్నీ అధికారికంగా దృవీకరించారు. దీంతో ఇప్పుడు, ముఖ్య మంత్రి చిన బాబు లోకేష్ కు ఏ శాఖలు ఇస్తారు లేదా చిన బాబు ఏ శాఖలు తీసుకుంటారు అనేది, అధికార పార్టీ వర్గాలలో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా చిన బాబు ఖాతాలో ఏ మంత్రుల ఉద్యగం ఉడుతుంది అనేది మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ముందుగా ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తోంది. తెలంగాణాలో, ముఖ్య మంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఅర్ అనేక ఇతర శాఖలతో పాటుగా, ఐటీ శాఖను కూడా నిర్వహిస్తున్నారు. పైగా చంద్రబాబుకు మొదటి నుంచి ఐటీ అంటే ప్రాణం. సో , ఐటీ శాఖ చిన బాబు ఖాతాలో చేరి పోయినట్లేనని అంటున్నారు.
మరో వంక ముఖ్యమంత్రి చంద్రబాబు మీద కుటుంబ వత్తిళ్ళు బాగా పెరిగాయని, అందు వలన చేతనే, లోకేష్ ను మంత్రి వర్గంలోకి తీసుకుంటున్నారని వినవస్తోంది. అదే విధంగా, శాఖల విషయంలో కూడా కేటీఅర్ కు ఏ మాత్రం తీసిపోకుండా చిన బాబుకు కీలక శాఖలు కేటాయించాలని కూడా కుటుంబం నుంచి గట్టి వత్తిళ్ళు వస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అది కూడా నిజం అయితే, ఐటీ తో పాటు కేటీఅర్ నిర్వహిస్తున్న పరిశ్రమలు - మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ తదితర శాఖలు కూడా చిన బాబు ఖాతాలో చేరిపోయే ‘ప్రమాదం’ లేక పోలేదని అప్పుడు మరికొందరు మంత్రులకు కూడా ఉద్వాసన అనివార్యం అవుతుందని అంటున్నారు.
అదలా ఉంటే, కొంత మంది మంత్రుల పనితీరు బాబు గారికి అంతగా సంతృప్తి ఇవ్వడం లేదని అలాంటి వారికీ కూడా పదవీ గండం తప్పక పోవచ్చని అంటున్నారు. ఈ కేటగిరీలో ప్రధానంగా రావెల కిశోరే బాబు - పీతల సుజాత - అయ్యన్న పాత్రుడు లాంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, మంత్రి వర్గానికి ‘యువ కళ’ తీసుకురావాలన్న డిమాండ్ కూడా చిన బాబు బృందం వినిపిస్తోంది. చిన బాబు ఈ మనోభీష్టాన్ని కూడా చంద్రబాబు తీరిస్తే, అప్పుడు ఎన్నికల్లో ఓడిపోయి దొడ్డిదారిన మండలిలో అడుగుపెట్టిన పయ్యావుల కేశవ్ - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వారికీ మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంటుంది. అలాగే, గాలి ముద్దు కృష్ణమ నాయుడు పేరు కూడా ఎందుకనో వినిపిస్తోంది. అంటే, మంత్రి వర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ జగిగితే, మాజీల సంఖ్య మరింత పెరిగుతుంది. ఈ తల నొప్పులకు తోడు అధికార దాహంతో వైసీపీ అధికార టీడీపీ లోకి ఫిరాయించిన 20 ఎమ్మెల్యేల లలో భూమా నాగిరెడ్డి సహా మరి కొందరు ముష్టాన్న భోక్తలకు శ్రీ శ్రీ శ్రీ చంద్రబాబు నావుయుడు గారు మంత్రి పదవులు ఎరగా వేసారు. ఇలా మొత్తంగా చూస్తే, సో - మంత్రి వర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ ఏది జరిగినా, కొందరు మంత్రుల కొలువులు పోవడం మాత్రమే కాదు, అధికార పార్టీలో ఇప్పటికీ రగులుతున్న విభేదాలు మరింతగా విరుచుకు పడడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే చిన బాబు గారి పట్టాభిషేకం పెద బాబు కునుకు లేకుండా చేస్తోంది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న సామెత గుర్తుకు వస్తోంది. విస్తరణ విష్పోటనం సృష్టించిననా ఆశ్చర్య పోవవసరం లేదని పిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/