బాబు ఫ్యామిలీ కడుతున్నపన్నుఎంత?

Update: 2015-09-28 03:58 GMT
చినబాబు రెఢీ అవుతున్నాడు. స్వతహాగా మాస్ లీడర్ కాకున్నా.. తనకున్న నాయకత్వ లక్షణాలు.. పరిపాలన దక్షతతో చరిష్మా లేకుండా.. తన పనే తన బ్రాండ్ గా మార్చుకొని హైటెక్ సీఎంగా పేరొందిన చంద్రబాబుకు తగ్గట్లే ఆయన కుమారుడిలో మాస్ అప్పీల్ ఏ కోశాన ఉండదు. ట్విట్టర్ పిట్టను అసరా చేసుకొని నాలుగైదు పవర్ ఫుల్ పంచ్ మాటలతో బండి లాగిస్తూ.. తండ్రి అధికారంతో మరింత పట్టు సాధించేందుకు చినబాబు కిందామీదా పడుతుంటారు.

గత ఆరేళ్లుగా తెర వెనుక రాజకీయాలు చేస్తూ.. తండ్రికి తోడుగా నిలుస్తున్నా.. ప్రజల్ని ఉర్రూతలూగించే ఒక్క ప్రసంగాన్ని సైతం చేయలేకపోయారు. అయితే.. ఇక్కడ లోకేశ్ ను మెచ్చుకోవాల్సిన అంశం ఉంది. మనసులు దోచుకునేలా మాట్లాడకున్నా ఫర్లేదు.. జనాలు తిట్టుకునేలా.. పార్టీకి నష్టం చేకూరేలా మాట్లాడకుండా తనకు తాను నియంత్రించుకునే తీరు లోకేశ్ సమర్థతపై ఆశలు కల్పించేలా ఉంటుంది.

తాజాగా ప్రెస్ మీట్ పెట్టేసి.. ఫ్యామిలీ ఆస్తి అప్పుల గురించి విలేకరుల సమావేశంలో చెప్పుకొచ్చిన ఆయన.. తమ కుటుంబ ఆస్తుల ప్రకటనను చేయటంతో పాటు.. తమ మాదిరి మిగిలిన అధినేతలు తమ ఆస్తుల్ని వెల్లడిస్తారా? అన్న సవాలును.. తన మాటలతో చేసేశారు. ఇదే సమయంలో తెలంగాణ సర్కారుకు తాము కడుతున్న పన్ను వివరాలు చెప్పి ఆశ్చర్యంలో ముంచెత్తారు.

తమ వ్యాపారాలు తెలంగాణలో అధికంగా ఉన్నట్లు చెప్పుకొచ్చిన లేకేశ్.. ప్రతిఏటా తమ కంపెనీ తరఫున రూ.30కోట్ల ఆదాయాన్ని తెలంగాణ ప్రభుత్వినికి పన్నుల రూపంలో ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అప్పుల పోను తమ ఆస్తుల గురించి వెల్లడించిన లోకేశ్.. తమకున్న నికర ఆస్తులతో పోలిస్తే.. ఏటా తెలంగాణ ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లించే మొత్తమే భారీ అన్న విషయాన్ని చెప్పటమే కాదు.. రాజకీయం మాట ఎలా ఉన్నా.. తెలంగాణకు ఆధాయాన్ని సమకూర్చి పెట్టే విషయంలో తమకు తాము కీలక భూమిక పోషిస్తున్న విషయాన్ని లోకేశ్ చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.
Tags:    

Similar News